'ఆర్య-2' రాక 25న
ఇవాల్టి యువతరం హీరోల్లో వేగం, స్టయిల్ అల్లు అర్జున్ సొంతం. తొలిచిత్రం 'గంగోత్రి'లో కేవలం నటనతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న అల్లు అర్జున్ సినిమా సినిమాకి నటనతో పాటు తన ఆహార్యంలో కూడా మార్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. టాలీవుడ్ హీరోల్లో సిక్స్ ప్యాక్ కు కూడా ఆయనే ఆద్యుడని చెప్పొచ్చు. 'హ్యాపీ' సినిమా మినహాయిస్తే 'ఆర్య', 'దేశముదురు', 'పరుగు'వంటి వరుస హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. కెరీర్ తొలినాళ్లలో తనకు మంచి పేరు తెచ్చిన 'ఆర్య' చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు 'ఆర్య 2'తో ప్రేక్షకులను ఉర్రూతలుగించేందుకు సిద్ధంగా ఉన్నారు. తొలి వెర్షన్ కు దర్శకత్వం వహించిన సుకుమార్ ఈ సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహించారు. ఆదిత్య బాబు, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవలే విడుదలైన ఆడియో అమ్మకాల పరంగా రికార్డు సృష్టిస్తూ, 'రింగ రింగ రింగారే' పాట యూత్ ను కుదిపేస్తోంది. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తోంది.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అల్లు అర్జున్ ఇందులో నటిస్తున్నారు. ఆయనకు జోడిగా కాజల్ నటిస్తోంది. మరో జంటగా నవదీస్, శ్రద్ధాదాస్ నటిస్తున్నారు. 'ఆర్య' చిత్రానికి 'ఆర్య-2' కొనసాగింపు కాదనీ, పూర్తి వైవిధ్యమైన ప్రేమ కథాంశమిదనీ నిర్మాతలు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచరం ప్రకారం ఈనెల 25న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అధికారికంగా మాత్రం ఇంకా తేదీ ప్రకటించాల్సి ఉంది.
Be first to comment on this News / Article!
|