'కామెడీ ఎక్స్ ప్రెస్' పాటలు
ఆశాషైనీ అలియాస్ మయూరి కథానాయికగా, బ్రహ్మానంద. కృష్ణ భగవాన్, ధర్మవరపు వంటి హాస్యతారాగణం ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'కామెడీ ఎక్స్ ప్రెస్'. తటవర్తి మీడియా పతాకంపై శంకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ కస్తూరి దర్శకుడు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైద్రాబాద్ లో జరిగింది. ఆడియో సీడీని ధర్మవరపు ఆవిష్కరించి తొలి క్యాసెట్ ను ఏలేటి మహేశ్వరరెడ్డికి అందజేశారు. ఆడియో క్యాసెట్ ను నందమూరి తారకరత్న ఆవిష్కరించి 'సంతోషం' సంపాదకులు సురేష్ కొండేటికి అందజేశారు.
ధర్మవరపు మాట్లాడుతూ, ఇవాల్టి కొత్త దర్శకులు కథకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారనీ, అలా తీసిన చిత్రమిదనీ, హాస్యనటులతో కలిసి చాలా సరదాగా షూటింగ్ లో పాల్గొన్నామనీ చెప్పారు. టైటిల్ తరహాలోనే సినిమా కూడా ఎక్స్ ప్రెస్ లా ప్రేక్షకుల్లోకి దూసుకుపోతుందని అనుకుంటున్నట్టు ఏలేటి మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఇందులోని ప్రతి పాట చాలా వైవిధ్యంగా ఉంటుందని సంగీత దర్శకుడు శ్యామ్ డి కాస్టో తెలిపారు. ఓ పాటను తాను పాడినట్టు బొంబాయి బోలే తెలిపారు. ఇది కామెడీ టానిక్ అని, ప్రేక్షకులంతా హాయిగా నవ్వుకోవచ్చని నిర్మాత శంకర్ రెడ్డి అన్నారు. ఆడియోతో పాటు సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని అతిథులు అభిలషించారు. మధుర ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా ఆడియో విడుదలైంది.
Be first to comment on this News / Article!
|