'బంపర్' హిట్టిచ్చారు: పూరీ
దర్శకుడు జయరవీంద్ర మాట్లాడుతూ, బంపర్ ఆఫర్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశమిచ్చిన పూరీ జగన్ కూ, ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు చాలా థాంక్స్ అని అన్నారు. బంపర్ ఆఫర్ ఆడియో రిలీజైన ఐదు నిమిషాల్లోనే పెద్ద హిట్టయినట్టు ప్రేక్షకులు తెలియజేశారనీ, అలాగే సినిమాను కూడా పెద్ద హిట్ చేశారనీ భాస్కరభట్ల పేర్కొన్నారు. పూరీ జగన్ సినిమాల్లో మంచి పాటలు రాసే అవకాశం తనకు ఇస్తున్నారనీ, మునుముందు కూడా మంచి పాటలు రాస్తాననీ అన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశమిచ్చిన జగన్, దర్శకుడు జయరవీంద్రకు చిత్ర కథానాయిక బిందు మాధవి కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకుల కోరిక మేరకు చిత్రంలోని కొన్ని డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్నారు.
తొలుత జితేందర్ చేసిన మిమిక్రీ ఆడియెన్స్ ను అలరించింది. ఆ కార్యక్రమానికి సింగర్ సింహా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పూరీ సంగీత్ తరఫున శంకర గణేష్ యూనిట్ సభ్యులకు 'బంపర్ ఆఫర్' ట్రిపుల్ ప్లాటినం డిస్క్ లను ప్రదానం చేశారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|