సెట్స్ లో నయనతార బర్త్ డే
మలయాళ ముద్దుగుమ్మ నయనతార టాలీవుడ్ ప్రేక్షకుల హాట్ ఫేవరెట్ గా కూడా ఆదరణ చూరగొంటోంది. 'చంద్రముఖి' చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు జోడిగా నటించడంతో ఒక్కసారిగా ఆమెకు క్రేజ్ వచ్చింది. తమిళ 'బిల్లా'లో బికినీలో కనిపించి సంచలనం రేపింది. 'తులసి', 'దుబాయ్ శీను', 'కథానాయకుడు', 'ఆంజనేయులు' వంటి పలు తెలుగు చిత్రాల్లో గ్లామర్ నటిగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేయించుకున్న నయనతార సెలక్టివ్ గా అయినా స్టార్ హీరోల సినిమాలనే ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కథానాయకుడుగా నటిస్తున్న 'అదుర్స్' చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తూ సరైన హిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తాజాగా ఆమె 'అదుర్స్' సెట్స్ లోనే బుధవారంనాడు తన బర్త్ డే జరుపుకొంటోంది.
నయనతార అసలు పేరు డియానా మిరయమ్ కురియన్. 1984లో కేరళలోని తిరువల్లాలో ఆమె జన్మించింది. ఇంగ్లీష్ లిటరేచర్ లో గ్రాడ్యుయేట్ అయిన నయనతార మోడలింగ్ తో కెరీర్ మొదలుపెట్టి వెండితెరకు వచ్చింది. ప్రస్తుతం తెలుగులో 'అదుర్స్ ' చిత్రానికి మాత్రమే ఆమె కమిట్ అయింది. హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆ చిత్రం తుది మెరుగుల దశలో ఉండటంతో నయనతార తన బర్త్ డే వేడుకను చిత్రయూనిట్ సమక్షంలోనే జరుపుకొంటున్నారు. మంగళవారం రాత్రి తన మిత్రులతో ఓ చిన్న పార్టీలో పాల్గొన్నారు. 'అదుర్స్' షూటింగ్ లో ఉండటం వల్ల ఈ రోజు కూడా మామాలు రోజులాగానే భావిస్తున్నాననీ, అర్ధరాత్రి నుంచి మిత్రులు ఫోన్లు చేస్తూ అభినందలు చెబుతున్నారనీ, పలు చోట్ల నుంచి వచ్చిన ఫ్రెండ్స్ ఓ చిన్న పార్టీ ఎరేంజ్ చేయడంతో కేక్ కట్ చేసి వారితో తన ఆనందాన్ని పంచుకున్నాననీ నయనతార చెప్పుకొచ్చింది. బర్త్ డే విషెస్ టు నయన...
Be first to comment on this News / Article!
|