తమిళ హీరో సూర్య మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య జ్యోతిక ఇప్పుడు ప్రెగ్నెంట్ అనీ, అయితే ఇప్పుడే ఆ విషయాన్నిబయట చెప్పడానికి వారు సముఖంగా లేనప్పటికీ తమ సన్నిహితులతో ఈ విషయం చెప్పి తమ సంబరాన్ని వారితో పంచుకుంటున్నారనీ తెలుస్తోంది.
దక్షిణాదిన హీరోయిన్ గా మంచి డిమాండ్ లో ఉన్న తరుణంలోనే జ్యోతిక హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2006 సెప్టెంబ్ 11న వీరి వివాహం జరిగింది. ఈ ఇద్దరికీ తొలి సంతానంగా 2007 ఆగస్టు 10న దియా జన్మించింది. జ్యోతిక మళ్లీ గర్భవతి కావడం ఆమె మామగారైన నటుడు శివకుమార్ కు రెట్టింపు సంబరంలో ముంచెత్తుతోందట. ఆయన కుమార్తె (సూర్య సోదరి) బ్రిందా కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ కావడమే ఇందుకు కారణం.