'ఓం శాంతి' లోగో ఆవిష్కరణ
నవదీప్, నిఖిల్, కాజల్, బిందుమాధవి, అదితి శర్మ ప్రధాన పాత్రల్లో త్రీ ఏంజెల్స్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శేషు ప్రియాంక చలసాని నిర్మిస్తున్న చిత్రం 'ఓం శాంతి'. దీనికి 'ఫైవ్ స్టోరీస్, ఫైవ్ లైవ్స్, ఒన్ ట్రూత్ ' అనే ట్యాగ్ లైన్ ఉంది. ప్రకాష్ దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఈనెల 27న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం అన్నపూర్ణా స్టూడియోస్ లో బుధవారం వినూత్న శైలిలో జరిగింది. ప్రధాన పాత్రధారులంతా డయాస్ పై నుంచి చిత్రంలో తాము పోషించిన పాత్రలను ఇంట్రడ్యూస్ చేశారు.
నవదీప్ మాట్లాడుతూ, ఇందులో తన పాత్రపేరు ఆనంద్ అనీ, కాలేజీ పూర్తయిన వెంటనే ఒక జాబ్ లోకి అడుగుపెడతాననీ, క్లబ్ల్ లు పబ్ లు అంటే ఇష్టపడుతుంటాననీ అన్నారు. అదితిశర్మ మాట్లాడుతూ, జీవితంలో అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకునే అంజలి పాత్రను ఇందులో పోషించానని తెలిపింది. బిందు మాధవి మాట్లాడుతూ 'ఆదాబ్, మేరా నామ్ నూరీ హై. మేరీ షాది జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ సే హోనే వాలీ హై ఔర్ యే మీరీ చోటీసీ కహానీ హై' అంటూ చెప్పుకొచ్చింది. ఆ వెనువెంటనే నిఖిల్ అందుకుంటూ 'తెలుగు సినిమాలో ఏంటీ ఈ హిందీ గోల...అసలు హీరోని ఇక్కడ పెట్టుకుని మీ అందరి గోల ఏంటి? నన్ను చూసి మీకు అంతా అర్ధమైపోయే ఉంటుంది. నా పేరు తేజ, టార్గెట్ రవితేజ' అంటూ తనను తాను పరిచయం చేసుకున్నారు. తన పేరు మేఘన అంటూ కాజల్ అగర్వాల్ పరిచయం చేసుకుంది. ఈ వేడుకలో
దర్శకనిర్మాతలతో పాటు పలువురు సాంకేతిక నిపుణులు, సి.అశ్వనీదత్ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|