మీరాజాస్మిన్ 'మోక్ష'
మీరాజాస్మిన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న హారర్ చిత్రం 'మోక్ష'. గతంలో 'బ్లాక్ అండ్ వైట్' చిత్రాన్ని రూపొందించిన శ్రీకాంత్ వేములపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమర్ నాథ్ మూవీస్ పతాకంపై పి.అమర్ నాథ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలిసారిగా ఈ చిత్రం ప్రోగ్రస్ ను నిర్మాత తెలియజేశారు.
కొత్త ఆలోచనలతో వాణిజ్య అంశాల మేలుకలయికగా రూపొందుతున్న హారర్ చిత్రమిదనీ, మీరా జాస్మిన్ ఎంతో వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నారనీ ఆయన తెలిపారు. రాజీవ్ మోహన్ లో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారనీ, ఆయన పాత్ర సినిమాకు హైలైట్ అవుతుందనీ చెప్పారు. ఈనెల 11న రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభించిన షూటింగ్ డిసెంబర్ 15 వరకూ నిరవధికంగా జరుగుతుందనీ, దీంతో 80 శాతం షూటింగ్ పూర్తవుతుందనీ తెలిపారు. డిసెంబర్ చివరి వారంలో చెన్నైలో జరిపే చివరి షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నాజర్, రాహుల్ దేవ్, రాజ్యలక్ష్మి తదితరులు నటించారు. పి.హిమబిందు సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట్ ఆర్.పి. ఛాయాగ్రాహకుడు.
Be first to comment on this News / Article!
|