శ్రీనువైట్ల డైరెక్షన్ లో మహేష్
ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు వరుస సినిమాలకు కమిట్ అవుతూ తన అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న 'మిస్టర్ పెర్ ఫెక్ట్' చిత్రానికి మహేష్ కమిట్ అయ్యారు. ఇది కాకుండా మరో చిత్రానికి కూడా ఇప్పుడు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విక్టరీ వెంకటేష్ తో 'నమో వెంకటేశ' చిత్రాన్ని నిర్మిస్తున్న యువనిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి 14 రీల్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంగా ద్వితీయ చిత్రంగా ఈ ప్రిస్టేజియస్ మూవీని నిర్మించనున్నారు. శ్రీనువైట్ల దర్శకత్వం వహించనున్నారు.
ఈ చిత్రం గురించి మహేష్ బాబు మట్లాడుతూ, శ్రీనువైట్ల చెప్పిన స్టోరీ చాలా బాగుందనీ, ఓ డిఫరెంట్ మాస్ ఎంటర్ టైనర్ గా అందర్నీ అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుందనీ అన్నారు. మహేష్ బాబుతో ఇది తన తొలి చిత్రమనీ, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథా చిత్రమిదనీ శ్రీనువైట్ల తెలిపారు. సినిమా ప్రథమార్థం ఎక్కువగా నార్త్ ఇండియాలో జరుగుతుందనీ, ఎంటర్ టైన్ మెంట్, రొమాన్స్, యాక్షన్ అన్నీ మేళవించిన ఈ చిత్రంలో ఎక్స్ లెంట్ విజువల్స్ ఉంటాయన్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో మహేష్ బాబు పొటన్షియాలిటీకి తగ్గట్టుగా చాలా గ్రాండ్ గా ఈ చిత్రం ఉంటుందనీ, తొలిసారి తాను సూపర్ 35 ఎంఎంలో షూట్ చేస్తున్న సినిమా ఇదనీ అన్నారు. మహేష్ నుంచి ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసే అన్ని అంశాలు ఇందులో ఉంటాయనీ, ముఖ్యంగా తన నిర్మాతలైన రామ్, గోపి, అనిల్ ను ప్రోత్సహించి వారికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన మహేష్ కు థాంక్స్ అనీ శ్రీనువైట్ల పేర్కొన్నారు. తమ మీద ఉన్న నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ కు అంగీకరించిన మహేష్ కు తమ కృతజ్ఞతలనీ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చాలా ప్రిస్టేజియస్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేశామనీ నిర్మాతలు తెలిపారు. మహేష్-శ్రీనువైట్ల తొలి కాంబినేషన్ చిత్రాన్ని సెన్సేషల్ హిట్ గా రూపొందించేందుకు శాయశక్తులా కృషిచేస్తామన్నారు. జనవరిలో 'నమో వెంకటేశ' రిలీజ్ కాగానే, ఫ్రిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తామనీ, ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందనీ చెప్పారు.
Be first to comment on this News / Article!
|