'యు అండ్ ఐ' బాక్స్
రోహన్, అదితి చౌదరి జంటగా రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'యు అండ్ ఐ'. రంజిత్ బెల్లూరి దర్శకుడు. శ్రీమతి యశోధరా దేవి సమర్పణలో జెఎస్ఎమ్ఎన్ సినిమా పతాకంపై రవీందర్ కుమార్ తోట ఈ చిత్రాన్ని నిర్మించారు. కార్తీక్ ఎం సంగీతం అందించిన ఆడియో ఇటీవలే విడుదలై ఆడియెన్స్ ను అలరిస్తోంది. తాజాగా ఈ చిత్రం తొలికాపీ కూడా సిద్ధమైంది. ఆ విశేషాలను చిత్రయూనిట్ హైదరాబాద్ లో తెలియజేసింది.
రంజిత్ బెల్లూరి మాట్లాడుతూ, ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందనీ, తొలి కాపీ కూడా సిద్ధంగా ఉందనీ చెప్పారు. ఇదొక సెన్సిబుల్ ఫిల్మ్ అనీ, యువతకు మంచి సందేశం కూడా ఇస్తున్నామనీ తెలిపారు. ఆత్మహత్యలు తప్పని చెబుతూనే, సైబర్ క్రైమ్ అనే అంశాన్ని ఇందులో ప్రస్తావించామని చెప్పారు. ఇదొక క్లీన్ అండ్ ఫీల్ గుడ్ మూవీ అవుతుందన్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రముఖ ఫాపింగ్ సెంటర్స్ లో ఒక డబ్బా ఏర్పాటు చేస్తున్నామనీ, విలువైన పుస్తకాలను విరాళంగా ఇవ్వదలచుకున్న వారు ఆ పుస్తకాలను బాక్సులో పొందుపరచాలనీ కోరారు. వాటిని విద్యార్థినీ, విద్యార్థులకు తాము నేరుగా అందజేస్తామన్నారు. తమ చిత్రంలోని హీరో కూడా ఇలాంటి మంచి పనే చేస్తాడనీ, కేవలం సినిమాలో చెప్పడమే కాకుండా ఆచరణలో పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ బాక్స్ కార్యక్రమాన్ని ఆరంభించారమని చెప్పారు. డిసెంబర్ రెండో వారంలో సినిమా విడుదలకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ కు చెందిన పలువురు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|