'జయహే' ప్రారంభం
ఆకాష్, గౌరీ పండిట్, అయేషా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త చిత్రం 'జయహే'. థ్రిల్లర్ మంజు కీలక పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సిగ్నస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై శివప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆదివారంనాడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి శ్రీనువైట్ల క్లాప్ ఇవ్వగా, ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ప్రసన్న కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
చిత్ర విశేషాలను థ్రిల్లర్ మంజు తెలియజేస్తూ, యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులకు వినోదాన్నిచ్చే అన్ని అంశాలు ఉంటాయని చెప్పారు. ఇందులో ఐదు పాటలు ఉంటాయనీ, తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామనీ చెప్పారు. ఇందులో తాను అండర్ కవర్ పోలీస్ గా నటిస్తున్నాననీ, చాలా స్టయిలిష్ గా తన పాత్ర ఉంటుందనీ ఆకాష్ తెలిపారు. తాను కూడా పోలీస్ పాత్రలో నటిస్తున్నాననీ, తనకు కొన్ని ఫైట్స్ కూడా ఉన్నాయనీ గౌరీ పండిట్ తెలిపింది. గతంలో బాలనటిగా పలు చిత్రాల్లో నటించిన తనకు ఇది హీరోయిన్ గా తొలిచిత్రమనీ, ఇందులో తనకు మంచి ఫైట్స్ కూడా ఉన్నాయనీ అయేషా తెలిపింది. ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తామని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగార్జున తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో శ్రద్ధా శర్మ, అవినాష్, రమేష్ భట్, రేఖ, రవికుమార్, ఆర్.కె. తదితరులు నటిస్తున్నారు. కథ-స్క్రీన్ ప్లే-ఫైట్స్ సైతం థ్రిల్లర్ మంజు అందిస్తున్న ఈ చిత్రానికి వంశీ మాటలు, గోవర్దన్ ఎడిటింగ్, ఎం.ఎస్.కృపాకర్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|