బాలుకు సుశీల పురస్కారం
ప్రముఖ గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యంకు శ్రీమతి సుశీల జాతీయ అవార్డును ప్రదానం చేశారు. నేపథ్యగాయకులుగా
అసమాన ప్రతిభ చూపిన వారి కోసం సుశీల ఈ అవార్డును గత ఏడాది ఏర్పాటు చేశారు. గాయని జానకి తొలి ఏడాది అవార్డును అందుకున్నారు. ఈ ఏడాది ఎస్.పి.బాలసుబ్రమణ్యంను అవార్డుకు ఎంపిక చేశారు. చెన్నైలోని శాంతోష్ హైస్కూలు ఆడిటోరియంలో ఆదివారంనాడు ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్, పి.సుశీల ఈ అవార్డును ఎస్.పి.బి.కి ప్రదానం చేశారు. దీంతో పాటు లక్ష రూపాయల నగదును కూడా అందజేశారు. టిఎం సౌందరరాజన్, పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, మనో తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|