'అదుర్స్' ఆడియో 5న
ఎన్టీఆర్ కథానాయకుడుగా కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వల్లభనేని వంశీ మోహన్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'అదుర్స్'. వి.వి.వినాయక్ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని డబ్బింగ్ జరుపుకొంటోంది. డిసెంబర్ 5న హైద్రాబాద్ లోని శిల్పకళా వేదికపై ఈ చిత్రం ఆడియోను, డిసెంబర్ మూడో వారంలో సినిమాను రిలీజ్ చేస్తున్న్టటు కొడాలి నాని తెలిపారు.
వినాయక్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ తో 'ఆది', 'సాంబ' చిత్రాల తర్వాత 'అదుర్స్' హ్యాట్రిక్ ఫిలిం అవుతుందనీ, ఎన్టీఆర్ మినహా 'అదుర్స్'లోని రెండు పాత్రల్నీ ఎవరూ చేయలేరనీ, ఎన్టీఆర్ కు మాత్రమే సూటయ్యే పాత్రల్లో ఆయన నటన అదుర్స్ అనిపించేలా ఉంటుందనీ అన్నారు. ఎన్టీఆర్ సరసన నయనతార, షీలా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మహేష్ మంజ్రేకర్, సాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, రఘబాబు, తనికెళ్ల భరణి, రామాప్రభ, రాజ్యలక్ష్మి తదతరులు నటిస్తున్నారు. కోన వెంకట్ కథ-మాటలు, చంద్రబోస్ పాటలు, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఆనంద్ సాయి ఆర్ట్, స్టన్ శివ-రామ్ లక్ష్మణ్ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|