'కేడీ'గా సెటిలైన నాగ్
నిర్మాత శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, 2010 సంవత్సరం కామాక్షీ మూవీస్ కు సిల్వర్ జూబ్లీ అకేషన్ కావడం, తమ బ్యానర్ నుంచి వచ్చిన తొలిచిత్రం 'శ్రావణమాసం' 1985లో రిలీజ్ అయి 25 ఏళ్లు పూర్తి కావడం, అదే ఏడాది నాగార్జునతో ఏర్పడిన పరిచయం దినదినాభివృద్ధి చెంది 25 వంసంతాలుగా తమ మధ్య ఆ స్నేహం కొనసాగుతుండటం చాలా సంతోషకరమైన విషయాలని అన్నారు. సిల్వర్ జూబ్లీ కానుకగా నాగార్జునతో 'కేడీ' సినిమా అందిస్తున్నామని అన్నారు. నాగార్జునను మాస్ హీరోగా చూడటమంటే తనకు ఇష్టమనీ, టైటిల్ కూడా బి,సి సెంటర్స్ కు బాగా పట్టే విధంగా ఉంటుందని అన్నారు. ఈనెల 3న గ్రీస్ లో ఒకపాట చిత్రీకరించి, ఆ తర్వాత హైద్రబాద్ లో ఏర్పాటు చేసే సెట్ లో క్లైమాక్స్ సాంగ్ తీస్తామని చెప్పారు. 20వ తేదీ నాటికి సినిమా పూర్తవుతుందని అన్నారు. జనవరి ప్రథమార్థంలో సినిమా రీలీజ్ కు ప్లాన్ చేశామని తెలిపారు.
ఈ చిత్రంలో డిఫరెంట్ నాగార్జునను చూస్తారని దర్శకుడు కిరణ్ పేర్కొన్నారు. నాగార్జున క్యారెక్టర్ కు, స్టోరీకి సరిపోయే టైటిల్ ఇదనీ, స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుందనీ చెప్పారు. నాగార్జునను తొలిసారి దర్శకత్వం వహించడం చాలా బాధ్యతతో కూడుకున్నదనీ, అయితే శక్తివంచన లేకుండా మంచి ప్రాడెక్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాననీ చెప్పారు. నిర్మాత శివప్రసాద్ రెడ్డి ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు విలువైన ఇన్ పుట్స్ ఇచ్చారనీ అన్నారు. ఈ చిత్రంలో నటించేందుకు అవకాశమిచ్చిన దర్శకుడు, హీరో నాగార్జునకు తన కృతజ్ఞతలని అంకుర్ అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|