రాజేష్ హీరోగా ఇవివి చిత్రం
అల్లరి నరేష్ తో 'బెండు అప్పారావు' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత దర్శకుడు ఇవివి సత్యనారాయణ తన పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ కథానాయకుడుగా ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టుబోతున్నారు. ఇవివి సత్యనారాయణకు దర్శకుడిగా ఇది 50వ చిత్రం కావడం విశేషం. బిగ్ బి ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ చిత్రం నిర్మాణమవుతుంది. ఇదొక నాన్ స్టాప్ కామెడీ చిత్రమని ఇవివి తెలిపారు.
ఇంతవరకూ తాను తీసిన చిత్రాల్లో ఏ కామెడీ సినిమా కూడా ఫెయిల్ కాలేదనీ, ప్రతీ చిత్రాన్ని ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారనీ, ఆ ప్రోత్సాహంతోనే తన కొత్త చిత్రాన్ని కూడా మరింత హాస్యభరితంగా ప్లాన్ చేశామనీ ఆయన తెలిపారు. ఇంతవరకూ తాను తీసిన సినిమాల కంటే 'ది బిస్ట్ కామెడీ ఫిలిం'గా ఈ చిత్రం ఉంటుందన్నారు. జనవరి 1 నుంచి నెల రోజుల పాటు హైద్రాబాద్ లో షూటింగ్ జరిపి, ఫిబ్రవరిలో బ్యాంకాక్ లో పాటలు, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడంతో సినిమా పూర్తవుతుందని చెప్పారు. మే మొదటి వారంలో రిలీజ్ ఉంటుందని చెప్పారు. పరిశ్రమలోని కమెడియన్లు అందరూ ఈ చిత్రంలో ఉంటారనీ, హీరోయిన్, ఇతర వివరాలు వారం రోజుల్లో తెలియజేస్తామని చెప్పారు.
Be first to comment on this News / Article!
|