'సింహా'నికి సరిజోడి!
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనివాసు దర్శకత్వంలో రూపొందుతున్న 'సింహా' చిత్రం ఇప్పుడు మరింత గ్లామర్ హంగులు సంతరించుకుంది. ఇప్పటికే స్నేహ ఉల్లాల్, నమిత ప్రధా హీరోయిన్లుగా కాగా, మూడో హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేసినట్టు బోయపాటి శ్రీను తెలిపారు. నయనతార మాత్రమే చేయగలిగిన పాత్ర కావడంతో ఆమెను ఎంపిక చేశామనీ, ఆ పాత్రలో ప్రత్యేకత ఉంటుందనీ చెప్పారు.
'కథానుసారం ప్రధాన నాయిక కోసం అనుకున్నప్పుడు యూనిత్ అంతా నయనతార పేరు ప్రపోస్ చేశారు. ఆ పాత్రకు ఆమె యాప్ట్ కావడంతో వెంటనే ఎంపిక చేశాం. ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నయనతార కనిపిస్తుంది. వీరోచితర భావాలు పలికించే పాత్రలో ఆమె కనిపించనుంది' అని బోయపాటి వివరించారు. ఇంతవరకూ జరిగిన షూటింగ్ తో 60 శాతం షూటింగ్ పూర్తయిందనీ, హైద్రాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో జరిపిన షూటింగ్ తో ఇక్కడి షెడ్యూల్ పూర్తయిందనీ, తర్వాత షెడ్యూల్ వైజాగ్, బొబ్బిలి, విజయనగరం, వరంగల్ తదితర ప్రాంతాల్లో చేస్తామనీ చెప్పారు జనవరి 10 వరకూ జరిగి షెడ్యూల్ తో టాకీతో పాటు 3 పాటల చిత్రీకరమ పూర్తవుతుందన్నారు. మిగిలిన 2 పాటలను అదే నెల 16 తర్వాత చిత్రీకరిస్తామని చెప్పారు. ఏప్రిల్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కె.ఆర్.విజయ, మలయాళ నటుడు సాయికుమార్, ఆనంద్ భారతి తదితరులు నటిస్తున్నారు. యూనైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్ధర్ విల్సన్ సినిమాటోగ్రఫీ, స్టన్ శివ-రామ్ లక్ష్మణ్ ఫైట్స్, చక్రి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|