'జగద్దురు బాబా'కు రాయితీ
ఎస్.ఆర్.ఆర్.క్రియేషన్స్ పతాకంపై బి.వి.రెడ్డి టైటిల్ పాత్రలో నటించి, నిర్మించిన 'జగద్గురు శ్రీ షిర్డి సాయిబాబా' చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం వినోదం పన్ను మినహాయించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి గూడ రామకృష్ణ దర్శకుడు. ఈ చిత్రానికి వినోదం పన్ను రాయితీని ఇవ్వడం పట్ల హైద్రాబాద్ లో ని ఫిలిం ఛాంబర్ లో గురువారంనాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.
సాయిబాబా పాత్ర ద్వారా తాము తెలియజేసిన సందేశానికి ప్రభుత్వం స్పందించి రాయితీ కల్పించిందనీ, ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తమ కృతజ్ఞతలనీ బివి రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రం విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టిందనీ, పాటలకు మంచి స్పందన వస్తోందనీ అన్నారు. ముఖ్యంగా దీపాలకు సంబంధించిన పాటకు వస్తున్న ఆదరణ అపూర్వమని అన్నారు. కులం, మతం. అంటరానితనం రూపుమాపేందుకు తన జీవితకాలం వెచ్చించిన గొప్ప సంఘ సంస్కర్త షిర్డీ సాయిబాబా అనీ, ఈ చిత్రంలో వాటిని ఆవిష్కరించామనీ గూడ రామకృష్ణ తెలిపారు. ఆధ్యాత్మిక చిత్రాలకు పన్ను రాయితీలు ఇవ్వరనీ, అయితే ఇందులో మంచి సాంఘిక సందేశం కూడా ఉండటంతో ప్రభుత్వం స్పందించి రాయితీ ఇవ్వడం ముదామహమని ఈ చిత్రంలో నటించిన శివకృష్ణ పేర్కొన్నారు. కొత్త అంశాలతో మంచి సందేశంతో ఈ రూపొందించిన చిత్రమిదని నట్టికుమార్ పేర్కొన్నారు. ఇందులో నటిచడం తమకు లభించిన వరమని సీనియర్ నటుడు చిట్టిబాబు, నటి శివపార్వతి సంతోషం వ్యక్తం చేశారు.
Be first to comment on this News / Article!
|