జయసుధ చీరల ఎగ్జిబిషన్
ప్రముఖ నటి, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమతి జయసుధ పాపులర్ డిజైనర్ కూడా. ఏటా ఆమె తన శారీ కలెక్షన్స్ తో ఎగ్జిబిషన్ నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా శారీ కలెక్షన్స్ ను జె.ఎస్. కలెక్షన్స్ పేరుతో ఆమె ఎగ్జిబిట్ చేయనున్నారు. ఇది 5వ వార్షిక ఎగ్జిబిషన్ కావడం విశేషం. ఎగ్జిబిషన్ కమ్ సేల్ గా దీనిని తాజ్ బంజారాలో ఈనెల 5వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8.30 వరకూ ఏర్పాటు చేస్తున్నారు.
ఇంతవరకూ సుమారు 150 చీరలకు తాను డిజైన్ చేశాననీ, వాటిని ఎగ్జిబిషన్ కమ్ సేల్ లో ఉంచుతున్నామనీ జయసుధ తెలిపారు. ఈసారి తాను డిజైన్ చేసిన చీరలతో పాటు ఇతర డిజైనర్ల చీరలు కూడా ఇందులో ప్రదర్శిస్తున్నామనీ, గతంలో తాను హైద్రాబాద్ , విజయవాడల్లో నిర్వహించిన ఎగ్జిబిషన్లకు చాలా మంచి స్పందన వచ్చిందనీ చెప్పారు. వ్యక్తిగతంగా తనకు చీరలంటే చాలా ఇష్టమనీ, చాలా సినిమాల్లో చీరలతోనే కనిపించాననీ నవ్వుతూ చెప్పారు. సహజంగా శారీ ఎక్స్ పోను ఏటా అక్టోబర్ లో నిర్వహించే తాను ఈసారి మాత్రం తమ ప్రియతమ నాయకుడు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మృతితో వాయిదా వేసి ఇప్పుడు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
Be first to comment on this News / Article!
|