నమిత భారీ స్కిన్ షో!
తెలుగులో సరైన ఆదరణ లేకపోవడంతో తమిళంలోకి అడుగుపెట్టిన నమిత అక్కడి తమిళ తంబీలను తన భారీ కాయంతో ఆకట్టుకుని మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. తమిళ షకీలాగా కూడా అనిపించుకుంది. స్కిన్ షో విషయంలో పెద్దగా పట్టింపులు లేని నమిత ఈ మధ్యనే ఇక నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తాననీ, స్కిన్ షో తగ్గించేస్తాననీ చిలక పలుకలు వల్లెవేసింది. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యం ఉందంటూ పలువురు నిర్మాతలు నమ్మించి ఆ తర్వాత తనను ఒకటి రెండు సన్నివేశాలకే పరిమితం చేయడం ద్వారా మోసగించారనీ, ఇప్పుడు వారి మాయమాటలు నమ్మే స్థితిలో లేననీ చెప్పుకొచ్చింది. ఇలాంటి ఆఫర్లు ఏడాదిలో 14 వదులుకున్నాననీ చెప్పుకొచ్చింది. నమిత చెబుతున్న దానికీ ఒప్పుకుంటున్న సినిమాలకీ బేరీజు వేసి చూస్తే ఇదో 'పబ్లిసిటీ స్టంట్' అనక తప్పలే లాదు. తాజాగా తన నిర్ణయం మార్చుకుందో ఏమో కానీ ప్రస్తుతం నమిత నటిస్తున్న మలయాళీ చిత్రం 'బ్లాక్ స్టాలిన్' స్టిల్స్ లో నమిత తన అందాలను భారీగానే ఆరబోసింది. ఇందులో క్లబ్ డాన్సర్ పాత్రలో నమిత నటిస్తోంది. ఇందులో ఓ కథానాయకుడైన బ్లాక్ స్టాలిన్ తో వేడివేడి బెడ్ రూమ్ సీన్స్, మరో హీరో కళాభావన్ మణితో స్విమ్ సూట్ సరసాలు వాల్ పోస్టర్ల రూపంలో ఇప్పటికే కలకలం సృష్టిస్తున్నాయి.
షకీలా తెరమరుగు కావడంతో నమిత నటించిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మలయాళ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. నమిత రెచ్చిపోయిన సంగతి తెలుసుకుని ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. తెలుగులో 'ఇద్దరు మొనగాళ్లు' పేరుతో సినిమా విడుదల కానుంది. తాజాగా తెలుగులోనూ పోసాని కృష్ణమురళికి జోడిగా 'మిస్ చింతామణి ఎంఏ' చిత్రంలో నటించేందుకు నమిత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో సిబ్బిశెట్టి గా పోసాని నటించనున్నారు. మహిళా పాత్రలను ఎలాకావాలంటే అలా మలుచుకోగలగిన పోసాని సినిమాలో నమిత చింతామణిగా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు విడుదలైన తర్వాతే నమిత మాటలకూ, చేతులకూ పోలిక ఉందా లేదా అనేది తేలుతుంది.
Be first to comment on this News / Article!
|