పాటల 'ప్రస్థానం'
ఒక యువకుడి జర్నీతో రూపొందిన చిత్రం 'ప్రస్థానం'. విజయవాడ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.'వెన్నెల' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని అందించిన దేవ్ కట్టా మూడేళ్ల పాటు కథపై కసరత్తు చేసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శర్వానంద్, రూబీ పరిహార్ (తొలి పరిచయం) జంటగా నటించిన ఈ చిత్రాన్ని వి.ఆర్.సి. మీడియా పతాకంపై రవి వల్లభనేని నిర్మించారు. ఈనెల 6న వినూత్న రీతిలో ఈ చిత్రం ఆడియోను విడుదల చేస్తున్నట్టు రవి వల్లభనేని తెలిపారు.
కాన్సెప్ట్ ఓరియెంటెండ్ చిత్రమిదనీ, దర్శకుడు దేవ్ కట్టా ఎంతో అవగాహనతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ ఆయన తెలిపారు. ఇటీవల హైద్రాబాద్ లో చిత్రీకరించిన పతాక సన్నివేశాలతో షూటింగ్ పూర్తయిందనీ, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయనీ అన్నారు. మహేష్ శంకర్ అద్భుతమైన సంగీతం అందించారనీ, వినూత్న శైలిలో ఈ చిత్రం ఆడియో విడుదల చేస్తున్నామనీ తెలిపారు. టీవీ, రేడియో, పత్రికల ద్వారా తమ చిత్రంలోని కథానాయకుడి పాత్రను తలపించే యువకులను ఎంపిక చేసి వారి చేతుల మీదుగా ఆడియో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సాయికుమార్, సందీప్ కిషన్, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి, జీవా, పవిత్ర, లోకేష్, సురేఖావాణి తదితరులు నటిస్తున్నారు. శామ్ దత్ సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|