'ఓంశాంతి' ఆడియో రిలీజ్
వైజయంతీ హౌస్ నుంచి త్రీ ఎంజెల్స్ స్టూడియో పతాకంపై ప్రకాష్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ శేషు ప్రియాంక చలసాని నిర్మిస్తున్న చిత్రం 'ఓంశాంతి'. మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో ఆష్కరణ హైద్రాబాద్ లోని ఇష్టా హోటల్ లో శుక్రవారం రాత్రి 7 గంటలకు జరిగింది. ఇళయరాజాతో వైజయంతీ మూవీస్ పతాకంపై పలు మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన కె.రాఘవేంద్రరావు 'ఓంశాంతి' తొలి పాటను రిలీజ్ చేయగా, ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, మెహర్ రమేష్, మురళీమోహన్ ఒక్కోపాటను రిలీజ్ చేశారు. ఆడియో సీడీని ఇళయరాజా ఆవిష్కరించి కె.రాఘవేంద్రరావుకు అందజేశారు. ఇదే వేదికపై ఇళయరాజాను రాఘవేంద్రరావు, అశ్వనీదత్ తదితరులు ఘనంగా సత్కరించారు.
ఇళయరాజా వంటి గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సినిమాల్లో నటించడం తన అదృష్టమని మురళీ మోహన్ పేర్కొన్నారు. ఇళయరాజా సినీ ప్రపంచానికి దేవుడిచ్చిన వరమని బి.గోపాల్ ప్రశంసించారు. ఇళయరాజా మ్యూజిక్ లో 14 సినిమాలకు దర్శకత్వం వహించడం తన అదృష్టంగా కోదండరామిరెడ్డి అభివర్ణించారు. ఇప్పుడున్న సంగీత దర్శకులు మ్యూజిక్ చేసేటప్పుడు ఇళయరాజాను తలుచుకుని చేస్తారనీ, అది ఆయన గొప్పతమనీ మెహర్ రమేష్ పేర్కొన్నారు. ఇళయరాజా మాట్లాడుతూ, 'ఓంశాంతి' సబ్జెక్ట్ చాలా ఇన్ స్పైరింగ్ గా ఉందనీ, కొత్తదనం ఉందనీ, మ్యూజిక్ కూడా కథకు తగినట్టుగా ఉంటుందనీ చెప్పారు. అశ్వనీదత్ కు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉందనీ, ఇప్పుడు వారి అమ్మాయి శేషు ప్రియాంక నిర్మిస్తున్న ఈ చిత్రంలోని మ్యూజిక్ కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానని పేర్కొన్నారు. 'వేదిక మీద అందరూ నన్ను చాలా పొగుతున్నారు. అందిరికీ నేను చెప్పేది ఒక్కటే. నేను పాటలు చేస్తాను. సూపర్ హిట్ చేసేది శ్రోతలే. వారి ఆశీర్వాదంతో ఇన్నేళ్లుగా వర్క్ చేస్తున్నాను. ఇప్పటికీ మ్యూజిక్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను' అని నవ్వుతూ చెప్పారు. నవదీప్, నిఖిల్, బిందుమాధవి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, బిందుమాధవి, మురళీ మోహన్ తదితరులు నటించారు. జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది.
Be first to comment on this News / Article!
|