'మా నాన్న చిరంజీవి' సాంగ్స్
జగపతిబాబు కథానాయకుడుగా జయశ్రీ సమర్పణలో లాఫింగ్ లార్డ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న వైవిధ్య భరిత కథా చిత్రం 'మా నాన్న చిరంజీవి' (అంటే పేద్ద హీరో). హేమ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఆడియో సీడీని జగపతిబాబు ఆవిష్కరించి తొలి ప్రతిని తమ్మారెడ్డి భరద్వాజకు అందించారు. బి.వి.రెడ్డి, ప్రసాద్ ల్యాబ్స్ నాగినీడు, కార్పొరేటర్ సదాశివ్ యాదవ్, మహేశ్వరరెడ్డి, హేమచంద్ర, విశాఖ టాకీస్ నట్టికుమార్ తదితరులు పాల్గొన్నారు.
జగపతిబాబు మాట్లాడుతూ, సహజత్వానికి దగ్గరగా ఉండే కమర్షియల్ చిత్రమిదనీ, ఒక మంచి పాయింటుని ప్రూవ్ చేయడానికి తీసిన సినిమా ఇదనీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న నట్టికుమార్ కు థాంక్స్ అనీ, ఇందులోని పాటలన్నీ చాలా బాగుంటాయనీ చెప్పారు. ఫాదర్ అండ్ సన్ మధ్య నడిచే కథ ఇదనీ, ఈ కథ చెప్పినప్పుడు అరుణ్ ప్రసాద్ చాలా క్లారిటీతో ఉన్నారనీ అన్నారు. ఒక మంచి బేనర్ లో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. నట్టికుమార్ మాట్లాడుతూ, జగపతిబాబు అంటే ఫ్యామిలీ హీరో అనీ, ఆయన అభిమానిగా ఆయనతో సినిమా చేయాలని ఎప్పట్నించో అనుకుంటున్నాననీ, ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసే అవకాశం తనకు కలగడం చాలా ఆనందంగా ఉందనీ అన్నారు. 80 నుంచి 100 ప్రింట్లతో ఈ నెలలో సినిమా రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. ఆడియో చాలా బాగా వచ్చిందనీ, సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనీ అన్నారు. నాగినీడు మాట్లాడుతూ, టైటిల్ చాలా వెరైటీగా ఉందనీ, అరుణ్ ప్రసాద్ డెఫినెట్ గా బాగా చేసి ఉంటారని అనుకుంటున్నాననీ అన్నారు. ఆడియో చాలా బాగుండటంతో సినిమా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందని బి.వి.రెడ్డి పేర్కొన్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తన పేరును సూచించిన తమ్మారెడ్డికి కృతజ్ఞతలని హేమచంద్ర అన్నారు. అలాగే 'రైడ్' చిత్రంతో సంగీత దర్శకుడుగా పరిశ్రమకు పరిచయం చేసిన బెల్లంకొండ సురేష్ కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. 'మా నాన్న చిరంజీవి'కి మంచి సంగీతం అందించడానికి దర్శకనిర్మాతలు ఎంతో సహకరించారని చెప్పారు. ఇంత మంచి కథను సినిమాగా తీయడానికి చాలా ధైర్యం ఉండాలనీ, అలాంటి గట్స్ దర్శకనిర్మాతలకు ఉన్నాయని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ప్రతి మనిషికీ హత్తుకునే కథ ఇదనీ, ఆడియోతో పాటు సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందనీ అన్నారు.
Be first to comment on this News / Article!
|