సెన్సార్ మెంబర్ గా కళ్యాణ్
కళామందిర్ షోరూమ్ ను స్థాపించి వస్త్ర ప్రపంచంలో సంచలనాలు సృష్టించిన 'కళామందిర్' కళ్యాణ్ తాజాగా సెన్సారు బోర్డు సభ్యునిగా ఎన్నికయ్యారు. కేంద్ర సమాచార శాఖ మంత్రి అంబికా సోని ఆయనను సెన్సార్ బోర్డు సభ్యునిగా నియమించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తన కంపెనీ తరఫున సహాయసహకారాలు అందించి వ్యాపారంలోనే కాకుండా దాతృత్యంలోనూ తాను ముందుంటానని కళ్యాణ్ చాటుకుంటున్నారు. ఇటీవల రాష్ట్రంలో వరదలు సంభవించినప్పుడు ముఖ్యమంత్రి సహాయనిధికి 10 లక్షల రూపాయల వస్త్రాలను, ఎన్టీఆర్ ట్రస్టుకు మరో 10 లక్షల రూపాయల వస్త్రాలను అందజేసి 'సింగారించడమే కాదు..సహాయపడటం కూడా మా బాధ్యత' అని చాటుకున్నారు. అలాగే...ఇన్ బ్రాండింగ్, ఔట్ బ్రాండిగ్ లతో సినీరంగానికి కూడా వెన్నుదన్నుగా నిలుస్తూ విడుదల సమయంలోనూ నిర్మాతలకు హెల్పింగ్ గా ఉన్నారు. సినీ వారపత్రిక 'సినీ స్టార్' కు ఆయన సలహాదారు కూడా. ప్రాంత్రీయ సెన్సార్ బోర్డు అధికారి విజయ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ ఉత్వర్వులను ఓ లేఖ ద్వారా కళ్యాణ్ కు తెలియజేశారు.
సినిమా రంగం పట్ల ఉన్న అభిరుచి, అవగాహన ఉన్న తనను కేంద్ర ప్రభుత్వం సెన్సార్ బోర్డు సభ్యునిగా నియమించడం చాలా సంతోషంగా ఉందనీ, కేంద్ర మంత్రి అంబికా సోనికి కృతజ్ఞతలనీ కళ్యాణ్ పేర్కొన్నారు. సినీరంగం విలువలను కాపాడుతూ, ప్రేక్షకులకు ఇబ్బంది కలుగకుండా సెన్సార్ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని తన బాధ్యతలను నెరవేరుస్తానని అన్నారు. రెండు సంవత్సరాల పాటు కొనసాగే ఈ ప్రభుత్వ పదవిని కళ్యాణ్ తనదైన శైలిలో సమర్ధవంతంగా నిర్వహించిన కళామందిర్ స్థాయిలోనే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కళామందిర్ చైర్మన్ ప్రసాద్, 'సినీస్టార్' చైర్మన్ మధుర శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
Be first to comment on this News / Article!
|