'అదుర్స్' ఆడియో రిలీజ్
ఎన్టీఆర్ కథానాయకుడుగా వి.వి.వినాయక్ దర్శకత్వం, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వల్లభనేని వంశీ మోహన్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'అదుర్స్' ఆడియో వేడుక అతిరథమహారధులు, అసంఖ్యాక అభిమానుల మధ్య హైద్రాబాద్ లోని శిల్పకళా వేదికపై ఈ చిత్రం ఆడియోన రిలీజ్ చేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నందమూరి బాలకృష్ణ ఆడియో సీడీని విడుదల చేసి, తొలిప్రతిని డా.దాసరి నారాయణరావుకు అందించగా, డా.మోహన్‌బాబు ఆడియో క్యాసెట్‌ను విడుదల చేసి తొలి క్యాసెట్‌ను రాజమౌళికి అందజేసారు. దేవీశ్రీప్రసాద్ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రానికి రామజోగయ్యశాస్ర్తి, చంద్రబోస్, కులశేఖర్‌లు సాహిత్యాన్ని సమకూర్చారు, ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్ర సంగీత హక్కుల్ని స్వంతం చేసుకుంది.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘కార్ యాక్సిడెంట్ అనంతరం బాబు(ఎన్టీఆర్) నటిస్తున్న ‘అదుర్స్’ చిత్రం అందరితోనూ అదుర్స్ అనిపించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అన్నారు. దాసరి మాట్లాడుతూ ‘తన దర్శకత్వంలో రూపొందిన ‘సర్దార్ పాపారాయుడు’ చిత్రంలో నటించేటప్పుడు కూడా ఎన్టీఆర్ కు స్కూటర్ యాక్సిడెంట్ జరిగిందని.. ఆ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో, ‘అదుర్స్’ చిత్రం కూడా అంతటి ఘన విజయం సాధిస్తుందన్న' నమ్మకం తనకుందన్నారు. మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ నా బిడ్డలాంటి తారక్(ఎన్టీఆర్) నటించిన ‘అదుర్స్’ ఘన విజయం సాధించాలని’ అభిలషించారు. నిర్మాతలు కొడాలి నాని- వల్లభనేని వంశీమోహన్లు తమ ప్రసంగంలో కార్యక్రమానికి హాజరై ఆశీస్సులు, అభినందనలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
దర్శకుడు వి.వి.వినాయక్ మాట్లాడుతూ 'ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసాడు. అందులో ఒక పాత్రను ఎవరైనా చేయగలుగుతారు. కానీ మరో పాత్రను మాత్రం ఎన్టీఆర్ తప్ప మరెవ్వరూ' చేయలేరన్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని అన్నారు. చిత్ర కథానాయకుడు ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘మళ్లీ నా కాళ్లమీద నేను నిలబడి మీ ముందు నిల్చుంటానని అనుకోలేదు. తాతయ్య ఆశీస్సులు, బాలయ్య బాబాయ్ ప్రోత్సాహం, అభిమానుల ఆకాంక్షలే శ్రీరామరక్షగా మారి పునర్జన్మ పొందాను. ‘అదుర్స్’ చిత్రాన్ని లాభాపేక్షతో కాకుండా నామీదున్న ప్రేమాపేక్షతో నాని అన్నయ్య, వంశీలు నిర్మించారు. బుజ్జి (నల్లమలుపు శ్రీనివాస్) ఈ చిత్రం కోసం ఒకటిన్నర సంవత్సరంగా అహర్నిశమూ శ్రమించాడు. వీళ్లందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాను’ అన్నారు. వీరితోపాటు ఈ కార్యక్రమంలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), శ్రీనువైట్ల, దిల్‌రాజు, కె.యల్,నారాయణ, యం.ఎల్.కుమార్‌చౌదరి, మాగంటి బాబు, మరియు చిత్ర యూనిట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన పాటల ట్రయలర్స్కు అభిమానుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఎన్టీఆర్ సరసన నయనతార, షీలా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మహేష్ మంజ్రేకర్, సాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, రఘబాబు, తనికెళ్ల భరణి, రామాప్రభ, రాజ్యలక్ష్మి తదతరులు నటిస్తున్నారు. డిసెంబర్ మూడో వారంలో సినిమాను రిలీజ్ చేస్తున్న్టటు కొడాలి నాని తెలిపారు.
Be first to comment on this News / Article!
|