ఆకాష్, థ్రిల్లర్ మంజు చిత్రం
ఆకాష్, గౌరీ పండిట్, ఆయేషా, థ్రిల్లర్ మంజు ప్రధాన పాత్రధారులుగా సిగ్నస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ముందు అనుకున్నట్లు జయహే టైటిల్ కాకుండా కథానుగుణంగా మరో టైటిల్ ను త్వరలో ఖరారు చేయనున్నామని నటుడు, దర్శకుడు థ్రిల్లర్ మంజు తెలిపారు. ఈనెల 10వ తేదీ వరకు తొలి షెడ్యూల్ జరుపుకొని ఆ తర్వాత 18 నుంచి బ్యాంకాక్, హాంకాంగ్ లలో రెండవ షడ్యూల్ ను జరపనున్నామని ఆయన అన్నారు. జనవరి మొదటివారంలో హైదరాబాద్ లో జరిపే మూడవ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ పూర్తవుతుందన్నారు. చక్కటి కమర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో ఐదు పాటలుంటాయన్నారు. హీరో ఆకాష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో ప్రతి సన్నివేశాన్ని థ్రిల్లర్ మంజు వైవిధ్యభరితంగా చిత్రీకరిస్తున్నారని, తనకు యాక్షన్ ఇమేజ్ తెచ్చిపెడుతుందని అభిప్రాయపడ్డారు. నటీమణులు ఆయేషా, గౌరీపండిట్ లు మాట్లాడుతూ తమకు పేరు తెచ్చే పాత్రలు చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో సూర్యనారాయణ్, శ్రద్ధాశర్మ, అవినాష్, రమేష్ భట్, రేఖ, రవికుమార్, ఆర్.కె.తదితరులు నటించనున్నారు. మాటలు వంశీ, సంగీతం ఎం.ఎన్.కృపాకర్, ఎడిటింగ్ గోవర్థన్, కథ, స్క్రీన్ ప్లే, సంట్స్, దర్శకత్వం థ్రిల్లర్ మంజు.
Be first to comment on this News / Article!
|