ఎస్.పి.చరణ్ 'పద్మవ్యూహం'
క్యాపిటల్ ఫిల్మ్ వర్క్సఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్.పి.చరణ్ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం 'పద్మవ్యూహం'. ఈ చిత్రానికి దర్శకుడు శక్తిరాజన్. కొత్త తరహా సినిమాలు కావాలనుకునేవారితో పాటు క్లాస్ ని, మాస్ ని ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని నిర్మాత ఎస్.పి.చరణ్ అన్నారు. తమిళంలో నాణయం పేరుతో నిర్మిస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుందనే ఉద్దేశంతో దీనిని అనువదిస్తున్నామని తెలిపారు. అనువాద కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 25న లేదా జనవరి 14న కానీ విడుదల చేస్తామని అన్నారు. దర్శకుడు శక్తిరాజన్ మాట్లాడుతూ పేరున్న ఓ బ్యాంక్ ను సురక్షితంగా కాపాడే ఓ సాఫ్ట్వేర్ ను హీరో కనిపెడతాడు. చివరకు కొన్ని పరిస్థితుల వల్ల హీరోనే ఆ బ్యాంక్ లో దొంగతనం చేయాల్సన పరిస్థితు ఎదురయ్యే ఆసక్తికరమైన థ్రిల్లర్ చిత్రమిదన్నారు. ఇందులోని ప్రతి మలుపూ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందన్నారు. మాటలు, పాటలు వెన్నెలకంటి, కెమెరా ఓం ప్రకాష్, సంగీతం జేమ్శ్ వసంతన్, ఎటిడింగ్ ప్రవీణ్, శ్రీకాంత్.
Be first to comment on this News / Article!
|