'గుడుగుడుగుంజం' ఆడియో
'2 మచ్', 'ఎక్స్ ట్రా' చిత్రాల తరువాత శ్రీ చిత్ర బ్యానర్ పై రూపొందుతున్న చిత్రం 'గుడుగుడుగుంజం'. డాక్టర్ రాజేంద్రప్రసాద్, పార్దు (హీరో నవదీప్ సోదరుడు), డాక్టర్ బ్రహ్మానందం ప్రధాన తారాగణం. వీరు దర్శకత్వంలో వి.రవికుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే బ్యాంకాక్ లో ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. క్రిస్మస్ కానుకగా ఆడియో, సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.
నిర్మాత రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈనెల 14 నుంచి 20 వరకూ రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాల్లో ప్యాచ్ వర్క్ పూర్తి చేసి జనవరి 14న సినిమా విడుదల చేస్తాని చెప్పారు. దాదాపు రెండు కోట్ల రూపాయల వ్యయంతో 60 రోజుల పాటు షూటింగ్ జరిపామనీ, రెండు సార్లు బ్యాంకాక్ వెళ్లి 50 శాతం సన్నివేశాలు, 7 పాటలు రెండు కెమెరాలతో నిర్విరామంగా జరిపామనీ చెప్పారు. ఈనెల 10న ఓ వెబ్ సైట్ ద్వారా సినిమాలోని 'మహిమహిమహిరే' అనే పాటను ప్రి-ప్రమోషన్ గా విడుదల చేస్తామని చిత్ర సంగీత దర్శకుడు కూడా అయిన వీరు తెలిపారు. ఇదే పాటను 11వ తేదీ నుండి ఎస్.ఎఫ్.ఎం. రేడియో ద్వారా ప్రసారం చేస్తామన్నారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ కు ముందే సీడెడ్ మినహా బిజినెస్ అయిపోయిందనీ, అండర్ ప్రొడక్షన్ లోనే ఇంత క్రేజ్ రావడానికి సహకరించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు కృతజ్ఞతలని అన్నారు. వినూత్న శైలిలో ఈనెల 25న ఆడియో రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుమన్, సితార, కస్తూరి, చాహత్, ఫరాఖన్, రితిమ, ఆర్తి, కృష్ణ భగవాన్, ఎమ్మెస్ నారాయణ, కొండవలస తదితరులు నటిస్తున్నారు. మరుధూరి రాజా స్క్రీన్ ప్లే, నంద్యాల రవి మాటలు, కులశేఖర్-భాస్కర భట్ల-విశ్వ పాటలు, నందమూరి హరి ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|