నాగ్ కు గ్రీకు ప్రభుత్వ సత్కారం
నాగార్జున, మమతా మోహన్ దాస్ లపై 'కేడి' చిత్రం కోసం ప్రస్తుతం గ్రీస్ లో ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఈనెల 11వరకూ ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది. జనవరి రెండో వారంలో సంక్రాంతి కానుకగా విడుదలయ్యే ఈ చిత్రంలో అమెరికా అమ్మాయి లిండా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అంకుర్ ('స్లమ్ డాగ్ మిలయనీర్' ఫేమ్), నిర్మల్ పాండే ('బండిట్ క్వీన్'), అఖిలేంద్ర మిశ్రా ('లగాన్'), 'డాన్' విలన్ కెల్లీడార్జ్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, హర్షవర్దన్, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషించారు. అన్నపూర్ణా స్టూడియో సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి కిరణ్ కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం అందిస్తుండగా, చంద్రబోస్-కృష్ణ చైతన్య పాటలు, సెల్వ ఫైట్స్, సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ, శ్రవణ్ ఎడిటింగ్, సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2
|