'రక్ష' సీక్వెల్ గా 'ఆవహం'
రామ్ గోపాల్ వర్మ హిందీ థ్రిల్లర్ 'ఫూంక్' తెలుగులో 'రక్ష' పేరుతో ఆ మధ్య వచ్చింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా 'ఫూంక్ 2' హిందీలో రూపొందుతోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు 'ఆవాహం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన రచయిత మిలంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ సమర్పణలో బుర్రా ప్రశాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తెలుగు, తమిళ (బొమ్మై-2), హిందీ భాషల్లో నిర్మితమవుతున్న చిత్రమిదనీ, వచ్చే ఏడాది ఫ్రిబవరి నెలాఖరులో ఈ సినిమా విడుదలవుతుందనీ నిర్మాత తెలిపారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, 'రక్ష' చిత్రంలో చేతబడి లాండి క్షుద్రశక్తులు తెలిసిన ఓ మంత్రగత్తె తన స్వప్రయోజనాల కోసం ఓ చిన్నపిల్లను హింసిస్తూ చంపే ప్రయత్నంలో ఆ అమ్మాయి తండ్రిని అనేక ఇబ్బందులకు గురిచేస్తుందనీ, తన పాపను రక్షించేందుకు ఆ తండ్రి ఒక మంత్రగాడ్ని కలిసి అతని సహాయంతో ఆమెను చంపుతాడనీ అన్నారు. చనిపోయిన ఆ మంత్రగత్తె ప్రేతాత్మ రూపంలో తిరిగొచ్చి తన మారణానికి కారణమైన మాంత్రికుడ్ని చంపండ దగ్గర్నించి 'ఆహవం' చిత్రకథ మొదలవుతుందని అన్నారు. సినిమా టెక్నికాలిటీ ద్వారా ప్రేక్షకుడికి చెమటలు పట్టించే రీతిలో ఈ చిత్రం ఉంటుందన్నారు. 'రక్ష'కు సీక్వెల్ గా 'ఆవహం' అనే ఐడియాతో రైటర్ మిలింద్ తన వద్దకు వచ్చి ఓపెనింగ్ సీక్వెన్స్ చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాయనీ, ఆ క్రమంలోనే ఆయనకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాననీ తెలిపారు. కన్నడ నటుడు సుదీప్, అమృత ఖన్విల్కర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|