'ఆయ్..మాది పసలపూడి'
వెండితెరపై వినోదాన్ని పంచడంలో వంశీది ఓ ప్రత్యేక శైలి. 'గోపి గోపిక గోదావరి' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత వంశీ మరోసారి దర్శకత్వ పగ్గాలు చేపడుతున్నారు. అల్లరి నరేష్ కథానాయకుడుగా ఈ చిత్రం ఉంటుందని ప్రముఖ నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరి ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి 'ఆయ్...మాది పసలపూడి' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు.
రచయితగా వంశీ రాసిన 'మా పసలపూడి కథలు' పుస్తకం రీడర్స్ ను ఎంతో ఇంప్రెస్ చేసింది. వంశీ స్వస్థలం కూడా పసలపూడే. ఈ లైన్స్ లోనే ఆయన సరికొత్త కాన్సెప్ట్ తో 'ఆయ్ మాది పసలపూడి' చిత్రానికి స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. ఒక్కో క్యారెక్టర్ కూ ఒక్కో కథ ఉండేలా ఈ కాన్సెప్ట్ ను వంశీ ప్లాన్ చేస్తున్నారనీ, హీరో అల్లరి నరేష్ తో పాటు కృష్ణ భగవాన్, సునీల్, ఎమ్మెస్ నారాయణ, ఝాన్సీ, సునీత ఆయా క్యారెక్టర్లు పోషించనున్నారనీ తెలుస్తోంది. 'గోపి...గోపిక...గోదావరి' సక్సెస్ తర్వాత వంశీ, 'బెండు అప్పారావు' హిట్ అనంతరం అల్లరి నరేష్ కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల అంచనాలు ఎక్కువగా ఉంటాయనీ, వాటిని మించేలా ఈ చిత్రం వినోదాత్మకంగా ఉంటుందనీ, అలాగే వంశీ-చక్రి మ్యూజికల్ కాంబినేషన్ మరోసారి సంచలనం సృష్టిస్తుందనీ నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరి చెబుతున్నారు. ఫిబ్రవరిలో ఈ చిత్రం ఓపినింగ్, మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.
Be first to comment on this News / Article!
|