'వాడే కావాలి' రివ్యూ
ప్రేమకథా చిత్రానికి సంగీతం, సంభాషణలు కీలకం. ఈ రెండు విభాగాలూ మంచి స్కోరింగ్ చేశాయి. 'ప్రేమను ప్రేమిస్తేనే జీవితం', 'కావాలని వదిలేది ఏదీ కావాలనుకున్నప్పుడు దొరకదు', 'మన ప్రేమ ప్రపంచానికి తెలియనక్కరలేదు. ప్రేమించిన వాళ్లుకు మాత్రం తెలియాలి' వంటి అలరించే సంభాషణలలను ప్రకాష్ అందించారు. ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించిన పాటల్లో 'ఏమైందో ఏమో నాలో కొత్తగా మరి...మనసేదో చేసేస్తోంది వింత అల్లరి', 'నువ్వే లేని నేను నేను కాను' వంటివి సాహిత్యం పరంగా, కంపోజింగ్ పరంగా ఆకట్టుకుంటాయి. 'ఛాలెంజ్' చిత్రంలోని 'యురేకా షకామిక' పాట హుషారుగొలుపుతూ, పిక్చరైజేషన్ పరంగా కూడా ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఫరవాలేదు. కల్యాణ్ సమి ఫోటోగ్రఫీ నీట్ గా ఉంది. మలేసియా అందాలను బాగా తెరకెక్కించారు. రామ్-లక్ష్మణ్ ఫైట్స్, కాస్ట్యూమ్స్ డిపార్ట్ మెంట్ కష్టం కూడా కొంత కనిపిస్తుంది. రఘునాథ్ సోగి, వీరేష్ బాబు నిర్మాణ విలువలు కూడా తగినట్టుగానే ఉన్నాయి.
సినిమా ప్రథమార్థం హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలతో సాఫీగానే నడుస్తుంది. ద్వితీయార్థంలో హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ అంశాలకు పెద్దగా స్కోప్ లేకపోవడం, కిక్ ఇవ్వనీ కామెడీ చోటుచేసుకున్నాయి. సెటిమెంట్ డామినేట్ చేసింది. యూత్ ను ఆకర్షించే టైటిల్ కావడం, సాయిరాం శంకర్ కు ఈమధ్యనే వచ్చిన సక్సెస్ ఈ చిత్రం ఇనీషియల్ ఓపినింగ్స్ కు ఉపకరించేలా అంశాలు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న 'ప్రత్యేక', 'సమైక్య' ఆందోళనల వాతావరణంలో సినిమా రిలీజ్ కావడం కొంత ప్రతికూల పరిణామం. ఎడాపెడా కొత్త రిలీజ్ లు కాచుకుని కూర్చున్న నేపథ్యంలో...కొద్ది రోజులు నిలపగలిగితే 'వాడే కావాలి' రిజల్ట్ ఎంతోకొంత పాజిటివ్ గా ఉండొచ్చు.

Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|