'సలీమ్' రిలీజ్ 12న ఖరారు
విష్ణు, ఇలియానా జంటగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో డాక్టర్ ఎం.మోహన్ బాబు నిర్మించిన 'సలీమ్' చిత్రానికి లైన్ క్లియర్ అయింది. 12వ తేదీ శనివారంనాడు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ శుక్రవారంనాడే చిత్రం రిలీజ్ కావలసి ఉండగా, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ వాతావరణం నేపథ్యంలో రిలీజ్ తేదీని వాయిదా వేశారు. తాజాగా 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మోహన్ బాబు శుక్రవారం ప్రకటించారు.
లక్ష్మీప్రసన్న పిక్చర్స్, రిలయన్స్ బిగ్ సినిమా పతాకాలపై 23 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరెక్కింది. ప్రపంచవ్యాప్తంగా 295 ప్రింట్లతో సినిమా రీలీజ్ అవుతోంది. టైటిల్ పాత్రలో విష్ణు, అతని ప్రేయసిగా ఇలియానా, కామెడీ డాన్ పాత్రలో మోహన్ బాబు, ఆయన సరనస కావేరీ ఝా కీలక పాత్రలు పోషించారు. సందీప్ చౌతా సంగీతం ఇప్పటికే ఆడియో పరంగా సక్సెస్ అయింది. ఈ చిత్రానికి చింతపల్లి రమణ మాటలు, చంద్రబోస్ పాటలు, ఆనంద్ సాయి ఆర్ట్, సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|