జనవరిలో 'మరోచరిత్ర'
వరుణ్ సందేష్, అనిత (తొలి పరిచయం) జంటగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో మ్యాట్ని ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మరో చరిత్ర'. దిల్ రాజు తన మిత్రులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవియాదవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది.
మోడ్రన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అమెరికాలో ఒక షెడ్యూల్, వైజాగ్ లో మరో షెడ్యూల్, దుబాయ్ లో రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైద్రాబాద్ లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. త్వరలోనే చిత్రీకరణ పూర్తి కానుంది. డిసెంబర్ లో ఆడియో, జనవరిలో సినిమా విడుదలకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి రవియాదవ్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|