తెలుగులో ఆయిరత్తిల్ ఒరువన్
'గజనీ' సూర్య తమ్ముడు కార్తీక్ ('పరుత్తి వీరన్' ఫేమ్) కథానాయకుడుగా డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ పతాకంపై ఆర్.రవీంద్రన్ తెలుగు, తమిళ భాషల్లో 40 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుస్తున్న చిత్రం షూటింగ్ పూర్తి కావ్చింది. '7/జి బృందావన్ కాలనీ', 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన శ్రీరాఘవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో 'ఆయిరత్తిల్ ఒరువన్' అనే పేరు పెట్టిన ఈ చిత్రానికి తెలుగు పేరు త్వరలో నిర్ణయిస్తారు. తెలుగు వెర్షన్ ను అమ్మ ఆర్ట్ క్రియేషన్స్ అధినేత జి.కుమార్ బాబు ఆంధ్రదేశమంతటా రిలీజ్ చేస్తారు.
జి.కుమార్ బాబు మాట్లాడుతూ, కార్తీక్ సరనస రీమాసేన్, ఆండ్రోస్ నాయికలుగా నటిస్తున్నారనీ, హిట్ చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ టెక్నికల్ వాల్యూస్ లో అద్భుతంగా తీస్తున్నారనీ చెప్పారు. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందన్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని చేసే అవకాశం ఇచ్చిన డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ అధినేత ఆర్.రవీంద్రన్ కు తమ కృతజ్ఞతలని అన్నారు. సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. కథ-స్క్రీన్ ప్లే సైతం శ్రీరాఘవ అందిస్తున్న ఈ చిత్రానికి రామ్ జీ సినిమాటగ్రఫీ, జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|