ఫిబ్రవరిలో 'అమాయకుడు'
ప్రేమ, వినోదం, ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రధానాంశాలుగా 'అమాయకుడు' చిత్రం తెరకెక్కుతోంది. కృష్ణుడు ('విలేజ్ లో వినాయకుడు' ఫేమ్) శరణ్య (తమిళ 'నాడోడిగళ్' ఫేమ్) జంటగా ఆక్టగాన్ మూవీస్ పతాకంపై భారతీగణేష్ దర్శ కత్వంలో బాలమురుగన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతవరకూ 80 శాతం వరకూ షూటింగ్ పూర్తయింది.
చిత్రం ప్రోగ్రస్ ను బాలమురుగన్ తెలియజేస్తూ, అరకు, వైజాగ్, పాడేరులలో కృష్ణుడు, అనన్యలపై నిక్సన్ నృత్య దర్శకత్వంలో ఇటీవల రెండు పాటలు చిత్రీకరించామనీ, మరో మూడు పాటల చిత్రీకరణ, కొద్ది పాటి టాకీ మిగిలి ఉందనీ చెప్పారు. కథ డిమాండ్ మేరకు ఒక పాట ఢిల్లీలో, మరో పాట చెన్నై, ఇంకో పాట హైద్రాబాద్ లో భారీ సెట్స్ వేసి చిత్రీకరిస్తామని అన్నారు. జనవరిలో ఆడియో, ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో కృష్ణుడు పూర్తిగా కమర్షియల్ నటుడుగా కనిపిస్తారనీ, పాటల్లో ఆయన వేసిన స్టెప్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చరానికి లోనవుతారనీ దర్శకుడు భారతీ గణేష్ చెప్పారు. మణికాంత్ కద్రి సంగీతంలో వనమాలి చక్కటి సాహిత్యాన్ని అందించినట్టు చెప్పారు. మంచి కొడుకుగా, అన్నగా, ప్రేమికుడుగా విభిన్న కోణాల్లో తన పాత్ర ఉంటుందని కృష్ణుడు పేర్కొన్నారు. ఈ చిత్రం తెలుగులో తనకు మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నట్టు అనన్య తెలిపింది. పూనమ్ సింగార్ మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అలేఖ్య చెల్లెలి పాత్ర పోషిస్తోంది.
Be first to comment on this News / Article!
|