21న 'కాఫీబార్' ఆడియో
ఒక యువకుడు, పదేళ్ల పాప, మరో అందమైన యువతి...ఈ ముగ్గురు చుట్టూ ప్రధానంగా తిరిగే కథతో రూపొందుతున్న చిత్రం 'కాఫీబార్'. లవ్, రొమాన్స్, మెసేజ్ సమాహారంతో రూపొందే హైటెక్ థ్రిల్లర్ ఇదని చిత్ర దర్శకుడు గీతాకృష్ణ చెబుతున్నారు. బ్లూఫాక్స్ సినిమా పతాకంపై ఈ చితరం రూపొందుతోంది. శశాంక్, బియాంక దేశాయ్, అతుల్ కులకర్ణి, గిరీష్ కర్నాడ్, బేబి శివాని ప్రధాన తారాగణం. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ నెల 21న ఆదిత్య మ్యూజిక్ ద్వరా ఈ చిత్రం ఆడియో విడుదల చేయనున్నట్టు గీతాకృష్ణ తెలిపారు.
విభిన్న మనస్తత్వాలు, ఆలోచనలు కలిగిన యువతీ యువకల మధ్య ప్రధానంగా సాగే ఇతివృత్తంతో ఈ చిత్రం ఉంటుందన్నారు. కాఫీబార్ లో కూర్చుకుని కొంతమంది యువకుల టేకాఫ్ గా ఈ చిత్రం ఉంటుందనీ, అదేమిటన్నది చెప్పడం కంటే తెరపై చూస్తేనే థ్రిల్ గా ఉంటుందన్నారు. అన్నారు. సినిమా ఆద్యంతం చాలా సరదాగా ఉంటూ, టెర్రరిజం పాయింట్ అంతర్లీనంగా ఉంటుందన్నారు. రెడ్ వన్ కెమెరాతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు చెప్పారు. ఎం.వి.రఘు, మురళి అందించిన సినిమాటోగ్రఫీ కనువిందు చేస్తుందనీ, మూడు భాషల్లో ఒకేసారి రూపొందిస్తుండటం వల్ల కొంత జాప్యం జరిగిందనీ చెప్పారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే-సంగీతం సైతం గీతాకృష్ణ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|