సంక్రాంతికి 'జాయ్'
అవితేజ్, త్రినాథ్ హీరోలుగా, పార్వతి, వైనవి హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఇ.వి.కుమార్ సమర్పణలో అరుణై పిక్చర్స్ పతాకంపై ఇవివి కంభన్ నిరిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'జాయ్'. బి.రాజా దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
కాలేజీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఎంతో స్నేహంగా ఉంటారు. వారి మధ్య అనుకోకుండా ప్రేమ చిగురిస్తుంది. అయితే తమ స్నేహానికి ప్రేమ మచ్చ కాకూడదన్న ఉద్దేశంతో వారు తమ ప్రేమను మనసులోనే దాటుకుంటారు. ఆ క్రమంలో జరిగే సంఘటనల వల్ల స్నేహం గెలిచిందా, ప్రేమ గెలిచిందా అనేది ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు రాజా తెలిపారు. ఇవాల్టి ట్రెండ్ కు అనుగుణంగా యూత్ ను ఆకట్టుకునే అంశాలతో రూపొందించిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందన్నారు. ఇందులో సునీల్ క్యారెక్టర్ హైలైట్ అవుతుందనీ, హీరోహీరోయిన్లు కొత్తవారైనప్పటికీ చాలా బాగా నటించారనీ చెప్పారు. అలాగే విద్యాసాగర్ మ్యూజిక్ మరో హైలైట్ అవుతుందన్నారు. ఈ కథ వినగానే ఎంతో ఇన్ స్పైర్ అయి ఆయన సిట్యూయేషనల్ మ్యూజిక్ ఇచ్చారని చెప్పారు. నిర్మాత కంభన్ మాట్లాడుతూ, మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. దర్శకుడు రాజాకు ఇది తొలి చిత్రమే అయినా ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని చెప్పారు. మలేసియాలోని అందమైన లొకేషన్లలో రెండు పాటలు, రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పబ్ సాంగ్ తో పాటు 15 రోజుల టాకీ, వైజాగ్ లో ఒక పాట, కొంత టాకీ, హైద్రాబాద్ లొకేషన్లలో ఒక పాట చేసినట్టు చెప్పారు. సంక్రాంతి కానుకగా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో వెన్నెరాడై మూర్తి, రేఖ, సూరి, బెనర్జీ తదితరులు నటిస్తున్నారు. స్వర్ణ సుధాకర్ మాటలు, భువనచంద్ర పాటలు, ఆకాష్ అశోక్ కుమార్ సినిమాటోగ్రఫీ, వి.టి.విజయన్ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|