'యేసుక్రీస్తు రెండవ రాకడ'
యుగాంతానికి ముందు తప్పక వస్తానని యేసుక్రీస్తు మాటల ఆధారంగా అక్షిత బాలాజీ క్రియేష్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'యేసుక్రీస్తు రెండవ రాకడ'. నిర్మాత హరీష్ కుమార్ యేసుక్రీస్తు పాత్రను పోషిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. కథ-కథనం-మాటలు-పాటలు-దర్శకత్వం బాధ్యతలను వెంకట్ పి.ఎస్. నిర్వహించారు. ఈ చిత్రం పాటలను హైద్రాబాద్ లో ఆదివారంనాడు విడుదల చేశారు. ఆడియో సీడీని నిర్మాత తండ్రి కుమర్ ఆవిష్కరించి బసివిరెడ్డికి అందించారు. మధుర ఆడియోస్ తో ద్వారా ఈ ఆడియో మార్కెట్ లోకి విడుదలైంది.
హరీష్ కుమార్ మాట్లాడుతూ, జీసెస్ గురించి ఇంతవరకూ వచ్చిన చిత్రాలకు భిన్నమైన చిత్రమిదనీ, బైబిల్ లోని కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా ఇందులో చర్చించామనీ చెప్పారు. 16 నిమిషాల గ్రాఫిక్ వర్క్ అద్భుతంగా ఉంటుందనీ, అలాగే తమిళంలో 3 చిత్రాలకు సంగీతం అందించిన ఎస్.వి.కరుణాకర్ ఈ చిత్రానికి మంచి సంగీతం అందించారనీ తెలిపారు. షూటింగ్ పూర్తయిందనీ, క్రిస్మస్ కానుకగా తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లీషులో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ చెప్పారు. ఈ చిత్రం ఆడియోతో పాటు సినిమా కూడా మంచి విజయం సాధించాలని అతిథులు అభిలషించారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో హేమరాజ్, మొయినుద్దీన్, కార్తీక్, అన్నపూర్ణ, కవిత, మీసాల రామారావు, రామ్మోహనరావు తదితిరులు నటించారు. మోహన్ చంద్ సినిమాటోగ్రఫీ అందించారు.

Read 1 Comment(s) posted so far on this News / Article!
|