ఉదయ్-శ్వేత ప్రేమకథ
ఉదయ్ కిరణ్, శ్వేతాబసు ప్రసాద్ జంటగా ప్రేమలో ఓ వైవిధ్యమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి పతాకంపై డి.కుమార్, ఈశ్వర వరప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. పాండిచ్చేరిలో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ మరో షెడ్యూల్ కు రెడీ అవుతోంది. దీనికి సుభాసెల్వం దర్శకుడు.
చిత్రం ప్రోగ్రస్ ను సమర్పకుడు యు.కె.ఎవెన్యూస్ పి.ఉదయ్ కిరణ్ తెలియజేస్తూ, ఈ చిత్రం తొలి షెడ్యూల్ హైద్రాబాద్ లోనూ, రెండో షెడ్యూల్ పాండిచ్చేరి, చెన్నైలోనూ పూర్తి చేసినట్టు చెప్పారు. ఉదయ్, శ్వేత, ఆశిష్ విద్యార్థి, నళిని, రాజ్యలక్ష్మి తదితరులపై రెండో షెడ్యూల్ లో భాగంగా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించామనీ, పాండిచ్చేరిలోని ఓ అందమైన హౌస్ లో తీసిన సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయనీ చెప్పారు. ఇంతవరకూ 40 శాతం షూటింగ్ పూర్తయిందన్నారు. చిత్ర నిర్మాణ సారథి సోమా విజయప్రకాష్ మాట్లాడుతూ, వైవిధ్యమైన ప్రేమ కథా ఇతివృత్తంతో పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రం రూపొందుతోందని అన్నారు. ఈ నెలాఖరులో కొడైకెనాల్, పాండిచ్చేరి, చెన్నైలో మూడో షెడ్యూల్ ఉంటుందనీ, ఇందులో భాగంగా కొన్ని పాటలు, టాకీ పూర్తి చేస్తామనీ, హైద్రాబాద్ లో జరిపే చివరి షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందనీ చెప్పారు. ఈ చిత్రానికి జనార్థన మహర్షి, నివాస్ రచన, రాఘవన్ సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్, ప్రదీప్ కోనేరు సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|