హీరో రానా వెబ్ సైట్
డాక్టర్ డి.రామానాయుడు మనువడు, సురేష్ బాబు కుమారుడు దగ్గుబాటి రానా సొంత వెబ్ సైట్ ను లాంచ్ చేశారు. ఎవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొదుతున్న 'లీడర్' చిత్రం ద్వారా రాణా తొలిసారి హీరోగా పరిచయమవుతున్నారు. సోమవారంనాడు ఆయన పుట్టినరోజు కూడా. ఈ సందర్భంగా ఆయన తన సొంత వెబ్ సైట్ 'ranadaggubati.com'ను ప్రారంభించారు.
రాణా మాట్లాడుతూ, ప్రేక్షకులు, అభిమానులకు తాను అందుబాటులో ఉండేందుకు సొంత వెబ్ సైట్ ఉపకరిస్తుందనీ, తన అభిప్రాయాలు, అనుభవాలను వారితో పంచుకునేందుకు, ఆడియెన్స్ అభిప్రాయాలు, సూచనలు తెలుసుకునేందుకు కూడా వీలవుతుందనీ అన్నారు. ఈ వెబ్ సైట్ లో రానా సమచారం. ఫోటో గ్యాలరీ, డౌన్ లోడ్స్ , ప్రత్యేక బ్లాగ్, ఫ్యాన్ జోన్, ఆయన తాజా చిత్రం 'లీడర్' కు సంబంధించిన ఆడియో, వీడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫ్యాన్స్ పంపే ఫోటోలు, బ్యానర్ వీడియోలను కూడా అప్ లోడ్ కూడా చేస్తారు. ఇదే నెల చివర్లో 'లీడర్' చిత్రం ప్రేక్షకుల ముందుకు కానుంది.
Be first to comment on this News / Article!
|