విక్రమ్ సరసన ఇలియానా
ఇలియానా మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ తమిళంలో అడుగుపెట్టబోతోంది. 'దేవదాసు', 'పోకిరి' వంటి సిల్వర్ జూబ్లీ హిట్ల తర్వాత ఇలియానా 'కేడీ' అనే తమిళ చిత్రంలో నటించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ ఫెయిల్యూర్ ను చవిచూడటంతో అప్పట్నించీ ఇలియానా తెలుగు సినిమాలకే పరిమితమవుతూ వచ్చింది. తమిళ స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చినప్పటికీ వాటికి దూరంగా ఉంటూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు ఆమె మనసు మార్చుకుని జాతీయ ఉత్తమ నటుడు ('పితామగన్' చిత్రం) విక్రమ్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి '24' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవల '13 బి' వంటి హిట్ చిత్రాన్ని అందించిన విక్రమ్ కె.కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
విక్రమ్ ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కలర్స్ స్వాతి కథానాయికగా నటిస్తోంది. ఇదే క్రమంలో విక్రమ్ కె.కుమార్ చిత్రాన్ని కూడా త్వరలోనే సెట్స్ పైకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రొమాన్స్, యాక్షన్, ఫ్యాంటసీ వంటి అంశాలు మేళవించిన ఫిక్షన్ చిత్రమిది. ఈ చిత్రంలో నటించేందుకు ఇలియానా పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇలియానా కథానాయికగా నటించిన 'సలీమ్' గతవారంలోనే విడుదల కాగా, ఎన్టీఆర్ కథానాయకుడుగా మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించనున్న చిత్రానికి కొత్తగా ఇలియానా కమిట్ అయింది.
Be first to comment on this News / Article!
|