700 ప్రింట్లతో 'అవతార్'
జేమ్స్ కేమరన్ తాజా సృష్టి 'అవతార్'. టెర్మినేటర్ (84), ఎలియెన్స్ (86), ఎబ్బిస్ (89), టెర్మినేటర్-2 (91), ట్రూ లైస్ (94), టైటానిక్ (97) వంటి ఒకదాన్ని మించిన ఒకటి భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందించిన క్రెడిట్ కేమరన్ దే. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అమితంగా ఆక్టటుకున్న 'టైటానిక్' తర్వాత పన్నెండేళ్లకు అందిస్తున్న చిత్రం 'అవతార్'. 2,400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని 'ఠాగూర్' మధు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అనువాద హక్కుల కోసం గట్టిపోటీ ఎదురైనప్పటికీ చివరకు ఆయనే ఈ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 18న విడుదల చేస్తున్నట్టు మధు తెలిపారు.
హాలీవుడ్ లో విడుదలకు ముందే విపరీతమైన క్రేజీ తెచ్చుకున్న చిత్రాల్లో 'అవతార్' టాప్ ప్లేస్ లో ఉందనీ, జేమ్స్ కేమరన్ ఈ చిత్రానికి దర్శకుడు కావడమే ఇందుకు ప్రధాన కారణమనీ అన్నారు. 60 శాతం కంప్యూటర్ మాయాజాలం, 40 శాంత లైవ్ యాక్షన్ ల సమ్మిళితంగా ఈ చిత్రం రూపొందిందని అన్నారు. రాముడినీ, హిందూ పురాణాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని కేమరన్ తెరకెక్కించారనీ, భారీతీయ సంప్రదాయం ఓ హాలీవుడ్ సినిమాకు ప్రేరణ కావడం అందరం అభినందించదగిన విషయమనీ అన్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్స్ కు మంచి స్పందన వస్తోందనీ, అలాగే హాలీవుడ్ లో జరిగిన ఈ చిత్రం ప్రీమియర్ షో లో పాల్గొన్న ఇంటర్నేషనల్ మీడియో హయ్యెస్ట్ రేటింగ్ తో రివ్యూలు రాయడం విశేషమనీ చెప్పారు. తెలుగులో కూడా ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. తెలుగు, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లో 700 ప్రింట్లతో ఈ చిత్రం విడుదల అవుతోందని చెప్పారు.
Be first to comment on this News / Article!
|