డిసెంబర్ రిలీజ్ లకు బ్రేక్!
'ఆర్య-2' చిత్ర ప్రదర్శనను తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అడ్డుకోవడం, పోస్టర్లు, కటౌట్లు ధ్వసం చేయడంతో పరిశ్రమకు చెందిన ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నెలలో విడుదల కావాల్సిన కొత్త చిత్రాలను వాయిదా వేయాలని నిర్ణయించారు. 'ఆర్య-2' చిత్ర ప్రదర్శనను బుధవారంనాడు అడ్డుకోవడం, ఫిల్మ్ రీళ్లు, కటౌట్లు ధ్వసం చేయడం వంటి సంఘటనల నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైద్రాబాద్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, శేఖర్ బాబు, మోహన్ బాబు, బివిఎస్ఎన్ ప్రసాద్, వల్లభనేని వంశీ, కోదండరామిరెడ్డి వంటి పలువురు నిర్మాతలు ఈ సమావేశం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈనెలలో కొత్త రిలీజ్ లు వాయిదా వేయాలని వారు నిశ్చితాభిప్రాయానికి వారు వచ్చారు.
ఎన్టీఆర్ 'అదుర్స్', దర్శకుడు శేఖర్ కమ్ముల 'లీడర్', కోదండరామిరెడ్డి నిర్మించిన 'కాస్కో', హీరో రాజా 'ఇంకోసారి' చిత్రాలు ఈనెలలో విడుదల కావలసి ఉండగా జనవరికి వాయిదా వేయడమే మంచిదని సినీ పెద్దలు, నిర్మాతలు నిశ్చయించారు. కళాకారులకు రాజకీయాలతోనూ, ప్రాంతీయ భేదాలతో సంబంధం లేదనీ, కళే సర్వస్వమనీ వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఆయా పార్టీల నాయకులను కలిసి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని వారు నిర్ణయించారు. దీనిపై సమష్టి నిర్ణయం తీసుకునేందుకు 24 క్రాఫ్ట్ లకు చెందిన వారంతా గురువారంనాడు అత్యవసరంగా సమావేశం కానున్నారు.
Be first to comment on this News / Article!
|