'వరుడు' ముస్తాబు
అల్లు అర్జున్ కథానాయకుడుగా గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్శిల్ మీడియో పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం 'వరుడు'. ఇందులో సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఈనెల 18 నుంచి ఫిలిం సిటీలో జరుగనుంది. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి.
చిత్రం ప్రోగ్రస్ ను గుణశేఖర్ తెలియజేస్తూ, రెండు పాటలు మినహా దాదాపుగా షూటింగ్ పూర్తయిందనీ, ఇందులోని పాటలన్నీ వేటూరి రాయడం విశేషమనీ చెప్పారు. ముఖ్యంగా ఈ చిత్రం కోసం పెళ్లి పాటను వేటూరి ఎంతో రీసెర్చ్ చేసి రాశారనీ, ఆయన అందించిన సాహిత్యం, మణిశర్మ సంగీతం ఈ చిత్రాన్ని బాగా ఎలివేట్ చేస్తాయమనీ తెలిపారు. అల్లు అర్జున్ నటన, విలన్ ఆర్య క్యారెక్టరైజేషన్ ప్రత్యేకతను సంతరించుకుంటాయని అన్నారు. నిజ జీవితంలోని వంద కుటుంబాలు తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఈ చిత్రంలో నటించారనీ, అలాగే ఇందులోని పాత్రకు కొత్త హీరోయిన్ పర్ ఫెక్ట్ గా సూట్ అయిందనీ చెప్పారు. అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యేలా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మార్చి 26న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. 'వరుడు' తమ బ్యానర్ కు ప్రిస్టేజియస్ చిత్రమవుతుందని డివివి దానయ్య పేర్కొన్నారు. సమ్మర్ స్పెషల్ గా క్లాస్, మాస్, ఫ్యామిలీస్, యూత్ అందర్నీ ఆకట్టుకునేలా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని అన్నారు. ప్రత్యేక పాత్రలో సింగీతం నటిస్తున్నట్టు చెప్పారు. సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వినయ్ ప్రసాద్ లతో పాటు ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తున్నారు. ఆర్.డి.శేఖర్ సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్స్, అశోక్ ఆర్ట్, ఆంధోని ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|