ముంబైలో 'పులి'
పవన్ కల్యాణ్ కొత్త చిత్రం ప్రారంభమై ఏడాదిన్నర అయింది. 'జల్సా' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత పవన్ కథానాయకుడుగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో సింగనమల రమేష్ నిర్మిస్తున్న 'పులి' చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. న్యూయార్క్, దుబాయ్ లలో ఇటీవల మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుని తాజాగా ముంబైలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది. పవన్ తో పాటు కీలక పాత్రధారలంతా ఇందులో పాల్గొంటున్నారు.
పవన్ కల్యాణ్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తుండగా, తీవ్రవాదాన్ని తిప్పికొట్టే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇందులో ఒకటి. ఇందులో భాగంగానే న్యూయార్స్, ముంబై సిటీలో తీసిన సన్నివేశాలు సినిమాకి హైలైట్ అవుతాయనీ తెలుస్తోంది. పవన్ కు జోడిగా నిఖిషా పటేల్ తొలిసారిగా తెలుగు తెరకు పరిచయమవుతోంది. 'ఖుషి' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత మరోసారి పవన్-ఎస్.జె.సూర్య కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతుండటం కూడా భారీ అంచనాలకు తావిస్తోంది. కీలక పాత్రల్లో మనోజ్ బాజ్ పేయి, చరణ్ రాజ్, నాజర్, జ్యోతికృష్ణ, శరణ్య, బ్రహ్మాజీ, కోవై సరళ, గిరీష్ కర్నాడ్ తదితరులు నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ లో 'రంగ్ దే బసంతి', 'దేవదాస్', 'మిషన్ కాశ్మీర్' వంటి చిత్రాలకు పనిచేసిన బినోద్ ప్రధాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|