కెరీర్ ఉజ్వలంగా ఉన్నప్పుడే భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకుని వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్న తారల జాబితాలో అందాల నటి అందాల నటి త్రిష కూడా చేరింది. తాజాగా ఆమె హోటల్ బిజినెస్ లోకి కూడా అడుగుపెడుతోంది. తన తండ్రి క్రిష్ణన్ నిర్వహణలో ఓ స్టార్ హోటల్ ను ప్రారంభించనుంది.
క్రిష్ణన్ హోటల్ మేనేజ్ మెంట్ లో మంచి అనుభవం గడించి పలు స్టార్ హోటల్స్ కోసం పనిచేశారు. ఆయనకు ఉన్న అనుభవంతో సొంత బిజినెస్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కొద్దికాలంగా త్రిష ఉన్నారు. ఇందుకోసం హైద్రాబాద్ లో స్టార్ హోటల్ నిర్మాణం జరిపి జనవరిలో పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో భారీ ఎత్తున ప్రారంభించేందుకు ఆమె సన్నాహాలు చేస్తున్నారు.. ఇది తన తండ్రికి ఇచ్చే న్యూ-ఇయర్ గిఫ్ట్ గా త్రిష చెబుతున్నారు. ప్రస్తుతం నటిగా కూడా ఆమె మంచి స్వింగ్ లో ఉన్నారు. తెలుగులో వెంకటేష్ సరసన నటిస్తున్న 'నమో వెంకటేశ' చిత్రం సంక్రాతికి విడుదలకు సిద్ధమవుతుండగా, తాజాగా రవితేజ కథానాయకుడుగా వెంకట్ నిర్మించనున్న కొత్త చిత్రానికి కమిట్ అయ్యారు. మరోవైపు తమిళంలో శింభు సరసన నటిస్తున్న 'విన్నైతాండి వరువాయ' చిత్రం పూర్తి కావచ్చింది. బాలీవుడ్ లో త్రిష తొలిసారిగా నటిస్తున్న 'కట్టామీటా' చిత్రం ముంబైలో నిర్మాణం కూడా జరుపుకొంటోంది. ఓవరాల్ గా...త్రిష పగడ్బందీ ప్లానింగ్ తో 'మిస్ పెర్ ఫెక్ట్' అనిపించుకుంటోంది.