'పా' తెలుగులో రీమేక్?
'తారే జమీన్ పర్' తరువాత బాలీవుడ్ లో కొత్తదనంతో కూడిన చక్కటి ప్రయోగాత్మక చిత్రంగా అమితాబ్ నటించిన 'పా' ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రశంసలు అందుకుంటూ బలమైన కలక్షన్లు రాబట్టుకుంటోంది. సునీల్ మాన్ చంద్, ఎబి కార్పొరేషన్, బిగ్ పిక్చర్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.బల్కి దర్శకత్వం వహించారు. జన్యుపరమైన లోపంతో పుట్టిన 13 ఏళ్ల బాలుడు ఆరోగా అమితాబ్ అవార్డులకు అర్హమైన నటనను ప్రదర్శించారంటూ అభినందనలు అందుకుంటున్నారు. నిజజీవితంలో అమితాబ్ కుమారుడై అభిషేక్ బచ్చన్ ఈ చిత్రంలో అమితాబ్ కు తండ్రిగా నటించడం విశేషం. విద్యాబాలన్, పరేష్ రావల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్రం ఇతర భాషల్లోకి కూడా రీమేక్ కానుంది. ఇళయరాజా రెండు భాషల రైట్స్ దక్కించుకున్నారని సమాచారం.
తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఇళయరాజా ఉన్నారని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. తమిళ వెర్షన్ మాటెలా ఉన్నా తెలుగులో అమితాబ్ పోషించిన ఛాలెండింగ్ రోల్ ను ఎవరు పోషిస్తారనేది ఆసక్తి రేపుతోంది. 'తారా జీమీన్ పర్' వంటి వినూత్న చిత్రాలను చేసే గట్స్ తెలుగు హీరోలకు లేవంటూ తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల అభిప్రాపడటం, అలాంటి పాత్రలు రచయితలు సృష్టించినా, ఆయా చిత్రాల రైట్స్ తెచ్చినా తాము నటించేందుకు, సొంతంగా నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పలువురు హీరోలు, నిర్మాతలు రిటార్డ్ ఇవ్వడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో యారో పాత్రను ఏ అగ్ర హీరో దక్కించుకుంటారనేది వేచి చూడాల్సిందే.
Read 3 Comment(s) posted so far on this News / Article!
|