తెలుగు హీరోలకు 'టి' సెగ...
క్లైమాక్స్ ఎంత రిచ్ గా, భారీ హంగులతో ఉంటే సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని సగటు సినీ ప్రేక్షకుడు బలంగా నమ్ముతుంటాడు. క్లైమాక్స్ లో హీరోలు చేసే 'వీరో'చిత విన్యాసాలు మాస్ ను కేరింతలు కొట్టిస్తుంటాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. టాలీవుడ్ హీరోలంతా 'టి' క్లైమాక్స్ కోసం ఉత్సుకతో ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితి కారణంగా నాగార్జున, వెంకటేష్, రవితేజ, మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాలు డోలాయమానంలో పడ్డాయి. బడ్జెట్ రూపంలో 150 కోట్ల రూపాయలు వరకూ చిక్కుకుపోయాయి.
తెలంగాణ అంశం శక్తివంతంగా రాష్ట్రాన్ని తాకడంతో అన్ని పరిశ్రమల మీద ప్రభావం చూపినట్టే తెలుగు సినిమా పరిశ్రమ మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రేక్షకులకు థియేటర్ల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో కేవలం 20 రోజుల్లో 35 నుంచి 40 కోట్ల రూపాలయ మేరకు నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోని వివిధ రీజియన్లలో నెలకొన్న తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పలువురు నిర్మాతలు తమ కొత్త సినిమాలు రిలీజ్ చేయరాదనే నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. ప్రస్తుత సంక్షుభిత పరిస్థితిలో కొత్త సినిమాలను రిలీజ్ చేయడమంటే మరిన్న క(న)ష్టాలను కోరితెచ్చుకోవడమే అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. 'సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా అనే విషయంపై లాంఛనంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదని ప్రతి నిర్మాతకూ తెలుసు. ఇది మంచి బిజినెస్ సెన్స్ అనిపించుకోదు కూడా' అని తెలుగు సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు ఎం.శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పారు. సమస్య తీవ్రతను అంచనా వేయలేకపోవడం వల్ల మోహన్ బాబు ఇప్పటికే తగు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. టిఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు తన దీక్ష విరమించడంతో కేవలం ఒకరోజు వాయిదాతో 'సలీమ్' చిత్రాన్ని మోహన్ బాబు విడుదల చేశారు. ఇదే తరుణంలో ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో ఉద్యమాలు మొదలు కావడంతో మోహన్ బాబు కుమారుడు నటించిన 'సలీమ్' చిత్రం చిక్కుల్లో పడింది. అనంతపురంలో ఆ సినిమా విడుదల కానేలేదు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|