హైద్రాబాద్ లో 'బృందావనం'
ఎన్టీఆర్ యమ స్పీడ్ లో ఉన్నారు. యువహీరోలు ఏడాదికి కనీసం రెండు సినిమాలలో నటించాలని నిశ్చయించుకోవడంతో ఎన్టీఆర్ సైతం వరస ప్రాజెక్ట్ లకు కమిట్ అవుతూ షూటింగ్ షెడ్యుల్స్ లో బిజీగా ఉంటున్నారు. 'అదుర్స్' చిత్రం విడుదలకు సిద్ధం కావడంతో ఆయన ఇటీవలే తన తదుపరి చిత్రం 'బృందావన్' (గోవిందుడు అందరి వాడేలే) షూటింగ్ లో అడుగుపెట్టారు. ఈ చిత్రం పొల్లాచ్చిలో పది రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకుని హైద్రాబాద్ లో మరో షెడ్యూల్ కు రెడీ అవుతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి ('మున్నా' ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు.
ఎన్టీఆర్, కథానాయిక కాజల్ పై ఇటీవల కోయంబత్తూరులో చిత్రీకరించిన పాట చాలా బాగా వచ్చందనీ, ఈనెల 21 నుంచి హైద్రాబాద్ లో రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ షెడ్యూల్ లో కొంత టాకీ పార్ట్ , యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగనుంది. జనవరి 6వ తేదీ వరకూ ఈ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఇతర ముఖ్య పాత్రల్లో ముకేష్ రిషి, అజయ్, శ్రీహరి తదితరులు నటిస్తున్నారు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడుగా మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించనున్న 'శక్తి' సైతం జనవరిలోనే ప్రారంభం కానుంది. ఇందులో ఇలియానా కథానాయిక.
Be first to comment on this News / Article!
|