ఈ ఏడాది సంక్రాంతి సీజన్ లో వచ్చిన 'అరుంధతి' చిత్రం అనుష్కను స్టార్ హీరోయిన్ ను చేసింది. అనుష్క తొలిసారి ద్విపాత్రాభినయంతో పాటు లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో చేసిన చిత్రమిది. ఆ చిత్రం సాధించిన సంచలన విజయం తర్వాత అనుష్క 'బిల్లా' వంటి కమర్షియల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం క్రిష్ 'వేదం' చిత్రంలోనూ, మహేష్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా మరోసారి 'పంచాక్షరి' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రానికి ఆమె రెడీ అవుతోంది.
నాగార్జున పెర్సనల్ అసిస్టెంట్ గా చాలాకాలంగా పనిచేస్తూ పలు నంది అవార్డులు అందుకున్న చంద్ర తొలిసారి 'పంచాక్షరి' చిత్రం ద్వారా నిర్మాతగా మారుతున్నారు. సీనియర్ డైరెక్టర్ వి.సుముద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈనెల 17న ఈ చిత్రం ప్రారంభించాలని అనుకున్నప్పటికీ ప్రస్తుత రాజకీయ సంక్షోభ పరిస్థితుల కారణంగా వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం ఈనెల 21 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ లో అడుగుపెట్టనుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి షూటింగ్ పూర్తి చేసి ఏప్రిల్ రెండో వారంలో సినిమా విడుదుల చేయాలని ఫిల్మ్ మేకర్స్ ప్లానింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.