క్రిస్మస్ 'జంటిల్ మేన్'
పోసాని కృష్ణమురళి కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'జంటిల్ మేన్'. వీరభద్ర ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు పద్మజ ఈ చిత్రాన్ని నిర్మించారు. పోసానికి జంటగా ఆర్తి అగర్వాల్, మరో హీరోయిన్ గా లూసి నటించారు. క్రిస్మస్ సందర్భంగా ఈనెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర సమర్పకుడు నల్లం శ్రీనివాస్ తెలిపారు.
భార్యాభర్తల అనుంధాన్ని తెలిపే కథాంశంతో పోసాని ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా మహిళలను విశేషంగా ఈ చిత్రం ఆకట్టుకుందని ఆయన చెప్పారు. ఇందులో పోసాని తొలిసారి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటించారనీ, అలాగే ఆర్తి అగర్వాల్ కు ఈ చిత్రం మంచి పేరు తెస్తుందనీ తెలిపారు. పోసాని మాట్లాడుతూ, బేసికల్ గా ఇదొక మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రమని అన్నారు. భార్యభర్తల మధ్య చోటుచేసుకునే కీలకమైన ప్రశ్నలను ఇందులో చర్చించామని అన్నారు. వివాహమైన కొంతకాలం తర్వాత భార్యాభర్తల సంబంధాల్లో వచ్చే మార్పులు, అభిప్రాయభేదాలు తలెత్తడానికి కారణాలను ఇందులో ప్రస్తావించినట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సురేఖ వాణి, నాగేంద్రబాబు, ఎం.ఎస్.నారాయణ, తదితరులు నటించారు. పోసాని కథ-స్క్రీన్ ప్లే సైతం అందించిన ఈ చిత్రానికి రామ్ పైడిసెట్టి పాటలు, ఆనంద్ సి కుమార్ సినిమాటోగ్రఫీ, మల్లికార్జున శర్మ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|